Hyderabad: డీఎస్సీని వాయిదా వేయాలని ఆందోళన.. విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీని వాయిదా వేయాలని లకిడీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నాయకులు యత్నించారు.
హైదరాబాద్: నగరంలోని విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీని వాయిదా వేయాలని లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నాయకులు యత్నించారు. ఇటీవల టీజీపీఎస్సీ నిర్ణయించిన హాస్టల్ వెల్ఫేర్, డీఏవో పరీక్షలను రాసినట్లు తెలిపారు. వరుసగా పోటీ పరీక్షలు ఉండటంతో చదవడానికి సమయం లేదని చెప్పారు. టెట్‌కు, డీఎస్సీకి భిన్నమైన సిలబస్ ఉండటంతో పూర్తి చేయలేకపోతున్నట్లు పేర్కొన్నారు. టెట్ ఫలితాలు తాజాగా విడుదలైన కారణంగా కొంత కాలం డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల నియామకాలు పూర్తయ్యే వరకు విద్యా వాలంటీర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కార్యాలయ ముట్డడికి యత్నించిన అభ్యర్థులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.