ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థుల(AP constable Aspirants)కు కీలక ప్రకటన జారీ చేసింది ప్రభుత్వం. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఫిజికల్ టెస్టులు(Physical Tests) నిర్వహించనున్నట్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్ రవిప్రకాష్ తెలిపారు.
అర్హత పొందిన అభ్యర్థులు ఈనెల 18 నుంచి 29వ తేదీ వరకు కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు slprb.ap.gov.in వెబ్సైట్ కు లాగిన్ అయ్యి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు. కాగా కానిస్టేబుల్ రాత పరీక్షలో 95,208 మంది అభ్యర్థులు అర్హత పొందగా.. వీరందరూ ఫిజికల్ టెస్టుల కోసం సిద్ధం అవుతున్నారు.