Rain Alert: . కూల్ న్యూస్ వచ్చేసింది.. మూడు రోజులపాటు వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ..

ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో ఎండ మండిపోతుంటే.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం వాతావరణం కూల్‌గా మారింది. ఒక్కసారిగా ఈదురుగాలతో కూడిన వర్షానికి ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల వాతావరణం చల్లబడింది.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ముమ్మిడివరం, యానాంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుండడంతో వాతావరణం చల్లబడింది. నిన్నటి వరకు భానుడి భగభగలకు ఉక్కపోత, వడగాల్పులతో అల్లాడిన ప్రజలు ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో ఈదురుగాలులకు భారీ వృక్షం నేలకొరిగింది. ఉప్పాడలో ఒకసారిగా కురిసిన భారీ వర్షానికి భారీ వృక్షం విరిగి రోడ్డు పై పడడంతో పార్కింగ్ చేసి ఉన్న ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది.ఆ టైమ్‌లో ఆటోలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇటు విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోనూ వాతావరణం చల్లబడింది. నిన్న ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడగా.. ప్రజలకు కాస్త ఊరట చెందారు. ఈదురుగాలులకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలపై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో పలు గ్రామాలు చీకటిలోనే ఉండాల్సి వచ్చింది.


నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి పయనం 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం /60 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా వెళుతుంది. తదుపరి కాలంలో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, లక్షద్వీప్ ప్రాంతం, కేరళ, కర్ణాటక, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోకి 2-3 రోజులలో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & పరిసరాల్లో సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ ఎత్తులో విస్తరించింది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :
ఈరోజు: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీవర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

రేపు: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీవర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:
ఈరోజు: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

రేపు: తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:
ఈరోజు: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

రేపు: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీవర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.