కొత్తిమీర గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఏ వంటకం చేసినా చివరలో కొత్తిమీర వేస్తే వచ్చే ఆ రుచే వేరు. కొత్తిమీరతో కూడా ఎన్నో రకాల వంటలు తయారు చేయవచ్చు.
కొత్తిమీర రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యం కూడా. ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.
కొత్తిమీరను ఉపయోగించి కొన్ని రకాల సమస్యలను ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. కాబట్టి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. దీని వలన గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
కొత్తిమీర తిన్నా, కొత్తిమీర రసం తీసుకున్నా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో త్వరగా వ్యాధుల బారి నుంచి బయట పడొచ్చు. అంతేకాకుండా వ్యాధులతో పోరాడే శక్తి కూడా లభిస్తుంది.
కొత్తిమీరతో తల నొప్పి, నోటి పూత, కడుపు ఉబ్బరం, నోటి దుర్వాసన వంటి సమస్యలను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కొత్తిమీర రసాన్ని తలపై మర్దనా చేసుకుంటే.. తలనొప్పి క్షణాల్లో మాయం అవుతుంది
కొత్తిమీర పేస్ట్, కొత్తిమీర రసాన్ని ముఖంపై రాయడం వల్ల మచ్చలు, మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. కొత్తిమీర రసాన్ని తాగడం వల్ల చర్మం హైడ్రేట్‌గా మారుతుంది. జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)