సినీప్రియులకు ఈవారం డబుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది. ఏప్రిల్ 11 ఒక్కరోజే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ వచ్చేశాయి. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన పలు సినిమాలు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేశాయి. అందులో కోర్ట్, ఛావా చిత్రాలు సైతం ఉన్నాయి. ఇంతకీ ఈ రెండు చిత్రాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందామా.
ఓటీటీ సినీప్రియులకు ఈ వారం పండగే పండగ. ఇన్నాళ్లు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ర్షం కురిపించిన సినిమాలు ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమయ్యాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో హిట్ అయిన చిత్రాలను ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చాయి. ఈ శుక్రవారం అడియన్స్ ముందుకు తెలుగులో సూపర్ హిట్ అయిన కోర్ట్, ఛావా చిత్రాలు వచ్చేశాయి. మరీ ఏ సినిమా ఎక్కడ చూడొచ్చు అనే విషయాలు తెలుసుకుందామా. ఈ ఏడాది తెలుగులో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా కోర్ట్. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. గత అర్దరాత్రి నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఛావా.. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన లేటేస్ట్ హిట్ మూవీ ఛావా. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఇందులో తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు విక్కీ కౌశల్. ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది. గత అర్దరాత్రి నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన ఛావా సినిమా ఇప్పుడు ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఈ మూవీ కేవలం హిందీలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. తెలుగు వెర్షన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది తెలియాల్సి ఉంది.
ఈ సినిమాతోతోపాటు తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ షణ్ముఖ సైతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో ఆది సాయి కుమార్, అవికా గోర్ జంటగా నటించారు. అలాగే తమిళంలో వచ్చిన కామెడీ మూవీ పెరుసు సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నాలుగేళ్ల కిందట వచ్చిన చోరీ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన చోరీ 2 సినిమా ఇప్పుడు అందులోబాటులోకి వచ్చింది. ఈ ఏడాదిలో సూపర్ హిట్ అయిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ప్రవీంకూడు షాప్పు. బేసిల్ జోసెఫ్ నటించిన ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.