ఇటీవల విడుదలై మంచి ఆదరణను సొంతం చేసుకున్న చిత్రం ‘కోర్ట్’ (Court). విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూశారు. తాజాగా దీని డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్(Netflix) వెల్లడించింది. ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. నటుడు నాని సమర్పించిన ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహించగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.
కథేంటంటే?: 2013 నేపథ్యంలో సాగే కథ ఇది. చంద్రశేఖర్ అలియాస్ చందు (రోషన్) ఇంటర్ ఫెయిల్ అయిన ఓ కుర్రాడు. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ ఉపాధి పొందుతుంటాడు. ఓ ఇంటి దగ్గర వాచ్‌మెన్‌గా పనిచేసే వ్యక్తి కొడుకు చందుకీ… పెద్దింటి అమ్మాయి, ఇంటర్‌మీడియట్ చదువుతున్న జాబిలి (శ్రీదేవి)కీ మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ విషయం కాస్త జాబిలి ఇంట్లో తెలిసిపోతుంది. ఎప్పుడూ కుటుంబం పరువు, స్థాయి అని మాట్లాడే జాబిలి బంధువు మంగపతి (శివాజీ) కోపంతో రగిలిపోతాడు. ఏం జరిగిందని వెనకా ముందు ఆలోచించకుండా పోక్సో చట్టంతోపాటు, ఇతర కఠినమైన సెక్షన్ల కింద చందుపై కేసు పెడతాడు (Court Review Telugu). ఆ పరిణామం ఏ తప్పూ చేయని చందు జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? పేరు మోసిన న్యాయవాది మోహన్‌రావు (సాయికుమార్) దగ్గర పనిచేసే జూనియర్ లాయర్ సూర్యతేజ అలియాస్ తేజ (ప్రియదర్శి) ఈ కేస్‌ని ఎలా భుజాన వేసుకున్నాడు? ఆ న్యాయ పోరాటం ఫలించిందా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.