కొమ్మినేని కేసులపై కోర్టు ఆగ్రహం.. డీఎస్పీ, ఎస్పీలకు మెమో జారీ

ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై నమోదైన కేసులో న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మినేనిపై నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ (SC/ST) అట్రాసిటీ చట్టంతో పాటు సెక్షన్ 356(2) సెక్షన్లను తొలగించాలని ఆదేశించారు.


“ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ఈ కేసునకు ఎలా వర్తిస్తుంది?” అని న్యాయమూర్తి పోలీసులను సూటిగా ప్రశ్నించారు. గతంలో ఒకసారి హెచ్చరించినప్పటికీ, మళ్ళీ అవే సెక్షన్లను ఎలా నమోదు చేస్తారని నిలదీశారు. ఈ విషయంపై డీఎస్పీ (DSP), ఎస్పీకి (SP) మెమో జారీ చేశారు.

ఈ సందర్భంగా, కొమ్మినేని తరపు న్యాయవాదులు కేసు నమోదైన డిబేట్‌కు సంబంధించిన వీడియోను న్యాయమూర్తికి చూపించారు. దీనితో కొమ్మినేనిపై తప్పుడు సెక్షన్లు నమోదు చేశారన్న ఆరోపణలకు బలం చేకూరింది. న్యాయమూర్తి జోక్యం ఈ కేసులో కీలక మలుపుగా మారింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.