టాలీవుడ్ ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి అనుకూలంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తీర్పును వెల్లడించింది. మెగాస్టార్ చిరంజీవి అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఆయన ఫొటోలు, బిరుదులు, వాయిస్, చిత్రాలను వాడుకోకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రక్షణ కల్పిస్తూ జడ్జి ఎస్.శశిధర్ రెడ్డి ఇంటెరిమ్ ఇంజంక్షన్ (మధ్యంతర ఉత్తర్వులు)ను మంజూరు చేశారు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అనుకూలంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తీర్పును వెల్లడించింది. ఇకపై చిరంజీవి పేరు, ఫొటో, బిరుదులు, వాయిస్, చిత్రాలను అనుమతి లేకుండా వాడకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులను మంజూరు చేశారు. తదుపరి విచారణను సిటీ సివిల్ కోర్టు అక్టోబర్ 27కు వాయిదా వేసింది. తాజాగా కోర్టు నిర్ణయంతో మెగాస్టార్ చిరంజీవి పేరును, ఇమేజ్, వాయిస్, ఫొటోలను అనధికారికంగా వాడటం లేదా ఏఐ సాంకేతికతను వినియోగించి సృష్టించడం నుంచి రక్షణ కల్పిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీవీ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్ ఫార్ములు, మీడియా సంస్థలు సహా అందరూ దీనికి కట్టుబడి ఉండాలని పేర్కొంది.
అనేక కంపెనీలు, సంస్థలు, సామాజిక మాధ్యమ ఖాతాలు.. చిరంజీవి అనుమతి తీసుకోకుండా ఆయన చిత్రాలను, ఏఐ సాంకేతికతతో సృష్టించిన చిత్రాలు, పోస్టర్లు ఇతర వస్తువులను విక్రయిస్తున్నారని చిరంజీవి తరఫు న్యాయవాది హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు వివరించారు. వీటివల్ల చిరంజీవి ప్రతిష్ఠ దెబ్బతింటుందని తెలిపారు. ఈ క్రమంలో చిరంజీవి వ్యక్తిగత హక్కులను కాపాడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. చిరంజీవికి నేరుగా ముడిపడి ఉన్న మెగాస్టార్, బాస్, అన్నయ్య, చిరు.. తదితర ట్యాగ్ లకూ ఇది వర్తిస్తుంది. అలాగే టీవీ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్ ఫార్ములు, మీడియా సంస్థలు సహా అందరూ దీనికి కట్టుబడి ఉండాలి. ఇక తదుపరి విచారణను సిటీ సివిల్ కోర్టు అక్టోబర్ 27కు వాయిదా వేసింది.
































