Credit card bill: ఈ చిట్కాలతో, మీ అప్పుల భారం తగ్గించుకొండి.

అప్పుల భారం పెరిగిందా.. మరియు ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ బిల్లులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈ టిప్స్ అనుసరించండి.. రుణభారం త్వరగా తగ్గుతుందని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు.


ప్రశాంతమైన జీవితం అంటే అప్పులు లేని జీవితం. పెద్దలు చెప్పినట్లు, “అప్పు లేని వాడే నిజమైన ధనవంతుడు”. కానీ నేటి ఆధునిక జీవితంలో అప్పులు చేయకుండా ఉండటం కష్టం. ఖర్చులు పెరగడం, ఆదాయం తగ్గడం వంటి కారణాల వల్ల ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో లోన్ తీసుకోవలసి వస్తుంది. ప్రతిసారి ఫ్రెండ్స్, రిలేటివ్స్ దగ్గర అప్పు అడగడం సాధ్యం కాదు. అందుకే క్రెడిట్ కార్డ్ వాడకం పెరిగింది. కానీ, క్రెడిట్ కార్డ్ బిల్లులు తిరిగి చెల్లించడం ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో ఈ టిప్స్ పాటిస్తే.. రుణభారం త్వరగా తగ్గుతుంది.

క్రెడిట్ కార్డ్ బిల్లు ఒకేసారి చెల్లించలేకపోతే..

  • EMI కి మార్చుకోవడం ఒక బెస్ట్ ఆప్షన్. కానీ దీనికి 12-15% వడ్డీ వస్తుంది.
  • EMI ప్లాన్లు సాధారణంగా 3-12 నెలల వరకు అందుబాటులో ఉంటాయి.
  • కానీ, అన్ని పర్చేసెస్కి EMI ఆప్షన్ లభించదు.

ఇతర ఎంపికలు:

✔ EMI కి మార్చుకోవడం ఉత్తమం.
✔ ఎక్కువ వాయిదాలు ఉన్న ప్లాన్ ఎంచుకోండి.
✔ తక్కువ వడ్డీ రేటు ఉన్న లోన్లు (హోం లోన్, పర్సనల్ లోన్) తీసుకోవచ్చు.
✔ 15% కంటే ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులను మొదట తీర్చండి.

బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఎలా సహాయపడుతుంది?

  • మీరు రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్లు కలిగి ఉంటే..
  • ఒక కార్డ్ బిల్లుని మరొక కార్డుకు ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
  • ఇలా చేస్తే 2-6 నెలల సమయం వరకు ఎక్స్ట్రా టైమ్ లభిస్తుంది.
  • కానీ, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసే ముందు వడ్డీ రేట్లు, ఇతర ఆఫర్లు చూసుకోండి.