Credit Card: క్రెడిట్ కార్డులపై రిజర్వు బ్యాంక్ సంచలన నిర్ణయం.. ఇక అలా కుదరదు..!!

www.mannamweb.com


RBI News: ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం దేశంలో విపరీతంగా పెరిగింది. అప్పులతో వస్తువుల కొనటం నుంచి కుదిరిన ప్రతి చోటా చెల్లింపులు చేపట్టేందుకు క్రెడిట్ కార్డులను ప్రజలు విరివిగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే విపరీత ధోరణిని అరికట్టేందుకు కార్డుల వినియోగంపై సంచలన నిబంధనలను రిజర్వు బ్యాంక్ ప్రకటించింది.

వివరాల్లోకి వెళితే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపుల విషయంలో పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డుల ద్వారా ఇంటి అద్దె, షాప్ రెంట్స్, సొసైటీ ఫీజుల చెప్పింపులు, ట్యూషన్ ఫీజు పేమెంట్స్, కార్డుల ద్వారా విక్రేత రుసుములు చెల్లింపు వంటి వాటిని త్వరలోనే నిలిపివేయాలని చూస్తోంది. ఇవి కార్డు వాస్తవంగా రూపొందించిన అవసరాలకు విరుద్దంగా ఉన్నాయని రిజర్వు బ్యాంక్ భావిస్తోంది. ఈ చెల్లింపులపై ఆర్బీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.

క్రెడిట్ కార్డ్ కస్టమర్-వ్యాపారికి మధ్య జరిగే వ్యాపార చెల్లింపుల కోసం రూపొందించబడింది. వ్యక్తిగత లావాదేవీల కోసం కాదని RBI విశ్వసిస్తుంది. కస్టమర్-వ్యాపారవేత్త కాకుండా ఇతర లావాదేవీలు ఉంటే డబ్బును స్వీకరించే వ్యక్తి కూడా డబ్బు పొందేందుకు బిజినెస్ అకౌంట్ తెరవవలసి ఉంటుందని ఆర్బీఐ స్పష్టంగా చెబుతోంది. గడచిన కొన్నేళ్లుగా దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగిన సంగతి తెలిసిందే. ఒక్క ఫిబ్రవరిలోనే క్రెడిట్ కార్డుల ద్వారా దాదాపు రూ.1.5 లక్షల కోట్లు చెల్లించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఇది వార్షిక ప్రాతిపదికన 26 శాతం పెరిగింది. వీటిలో ఎక్కువగా అద్దె చెల్లింపులు, ట్యూషన్ ఫీజులు, సొసైటీ ఫీజులు చెల్లింపులు ఉన్నట్లు రిజర్వు బ్యాంక్ గుర్తించింది. వాస్తవానికి ఇంటి అద్దె చెల్లింపులను క్రెడిట్ కార్డుల నుంచి చేపట్టెందుకు వీలుగా అనేక ఫిన్ టెక్ కంపెనీలు అవకాశం కల్పించటంతో కార్డుల వినియోగం భారీగా ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. 1-3 శాతం రుసుముతో చెల్లింపులకు అనుమతి కల్పిస్తున్నాయి. కార్డు సౌకర్యాన్ని అందిస్తున్న చాలా బ్యాంకులు కార్డు చెల్లింపులకు దాదాపు 45-50 రోజులు గడువు అందించటంతో ఈ మార్గాన్ని చాలా మంది నగదు అత్యవసర అవసరాల కోసం వినియోగిస్తున్నారు. అలాగే మరికొందరు తమ కార్డు వార్షిక రుసుముల మాఫీ కోసం కూడా ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారు.

అయితే ఆర్బీఐ కార్య‌క్ర‌మంలోకి వ‌చ్చిన త‌ర్వాత బ్యాంకులు అల‌ర్ట్ అయ్యి ఇలాంటి చెల్లింపుల‌ను ఆపేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించాయి. చాలా బ్యాంకులు అద్దె చెల్లింపుపై రివార్డ్ పాయింట్లను నిలిపివేసాయి. కొన్ని బ్యాంకులు వార్షిక రుసుమును మాఫీ చేయడానికి ఖర్చు పరిమితి నుంచి ఇంటి అద్దె, ట్యూషన్ ఫీజు చెల్లించే ఎంపికను మినహాయించాయి. అయినప్పటికీ ప్రజల నుంచి క్రెడిట్ కార్డుల నుంచి ఇటువంటి చెల్లింపులకు డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. త్వరలోనే వీటిని పూర్తిగా నిలిపివేసే అవకాశాలు సైతం అధికంగా కనిపిస్తున్నాయి.