ఇకపై స్కూల్స్‌లో క్రికెట్ కూడా ఒక సబ్జెక్ట్‌! పూర్తి వివరాలు..

www.mannamweb.com


ఏదైన క్రీడ గురించి.. పాఠ్యాపుస్తకాల్లో ఒక లెసన్‌గా ఉంటుంది. కానీ, ఇప్పుడు క్రికెట్‌ను ఏకంగా ఒక సబ్జెక్ట్‌గా తీసుకొస్తున్నారు. కచ్చితంగా పిల్లలందరూ.. క్రికెట్‌ నేర్చుకోవాల్సిందే, పైగా వాటిలో పోటీ కూడా పెడతారు. ఎలాగైతే మనం అన్ని సబ్జెక్ట్స్‌కు ఎగ్జామ్స్‌ రాస్తామో.. అలాగే క్రికెట్‌ ఆడి.. మంచి ప్రదర్శన కనబర్చి మార్కులు పొందాలి. ఇలాంటి కర్‌క్యూలమ్‌తో పిల్లలను క్రికెట్‌ నేర్చుకునే విధంగా ప్రొత్సహించేందుకు ఆస్ట్రేలియాలోని ఒక స్కూల్‌ వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడిన ఘనత ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్లకు దక్కుతుంది. 1877లో ఈ రెండు జట్లు తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాయి. అయితే.. 2027తో ఈ రెండు జట్లు తొలి టెస్ట్‌ ఆడి 150 ఏళ్లు పూర్తి చేసుకోనున్నాయి. ఈ 150 ఏళ్లలో ఆస్ట్రేలియా క్రికెట్‌ ఎంతో ఎదిగింది. ప్రపంచ క్రికెట్‌ను కొన్ని దశాబ్దాల పాటు తిరుగులేని శక్తిగా శాసించింది. 6 వన్డే వరల్డ్‌ కప్‌లు, ఒక టీ20 వరల్డ్‌ కప్‌, ఒక డబ్య్లూటీసీ కప్‌ను సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో మోస్త్‌ సక్సెస్‌ఫుల్‌ టీమ్‌గా ఉంది.

ఆస్ట్రేలియా తొలి టెస్ట్‌కు 150 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా విక్టోరియాలోని ‘లారా సెకండరీ కాలేజ్‌’ క్రికెట్‌ను తమ కర్‌క్యూలమ్‌లో చేర్చనున్నారు. అన్ని 1 నుంచి 10వ తరగతి వరకు క్రికెట్‌ను ఒక ఫార్మాల్‌ సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టి.. 9, 10వ తరగతి వి​ద్యార్థులకు మ్యాచ్‌లు కూడా నిర్వహించనున్నారు. క్రికెట్‌కు సంబంధించి కేవల ఆట మాత్రమే కాకుండా.. అంపైరింగ్‌, కోచింగ్‌, ఆటగాళ్లకు ఫస్ట్‌ ఎయిడ్‌ చేయడం ఇలా క్రికెట్‌కు సంబంధించిన అన్ని అంశాలు ఆ సబ్జెక్ట్‌లో ఉంటాయి. భవిష్యత్తులో వాళ్లు క్రికెటర్లుగానే కాక.. క్రికెట్‌కు సంబంధించిన వేరే ఇతర విభాగంలో కూడా కెరీర్‌ను కొనసాగించేందుకు స్కూల్‌ లెవెల్‌ నుంచే ఆ దిశగా ప్రొత్సహించనున్నారు.