గుడివాడలో దారుణం, బ్లేడుతో భర్త పీక కోసి పరారైన భార్య

ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కసాయి భార్య కట్టుకున్న భర్త పీక కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసింది. గుడివాడలో 22వ వార్డు రైలు పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కుటుంబ కలహాలతో భర్త చిన్న(36)ను.. బ్లేడుతో పీక కోసి ఇద్దరు పిల్లలతో భార్య జ్యోతి పరారైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గుడివాడ పోలీసులు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.