Crispy Corn Recipe: చలికాలం ,వర్షాకాలంలో,చల్లచల్లని వాతవరణంలో వేడి వేడిగా స్నాక్స్ తినాలి అనుకుంటే క్రిస్పి కార్న్ ట్రై చేయండి.
కావాల్సిన పదార్ధాలు స్వీట్ కార్న్ – 2 కప్పులు బియ్యం పిండి – 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్ కారం – 1 టీ స్పూన్ ఉప్పు – రుచికి సరిపడా ధనియాల పొడి – 1 టీ స్పూన్ పసుపు – ¼ టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు – ¼ టీ స్పూన్ నిమ్మరసం – 1 టీ స్పూన్ బటర్ – 1 టేబుల్ స్పూన్ నూనె – 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
1.క్రిస్పి కార్న్ కోసం రెండు కప్పుల కార్న్ ను ఉడకబెట్టుకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ ను పెట్టుకోని వేడి చేసి అందులోకి సగం వరకు నీళ్లుపోసి మరిగిన నీటిలో స్వీట్ కార్న్ వేసుకోని ఉడికించి వడగట్టుకోవాలి.
3.ఉడికిన స్వీట్ కార్న్ ను వేరొక గిన్నెలోకి తీసుకోవాలి.
4.అందులోకి కారం ,ధనియాల పొడి,పసుపు,తరిగిన వెల్లుల్లి,బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్,నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.
5.మసాల పిండి కార్న్ కి సరిగ్గా కోట్ ఉండేలా చూసుకోవాలి.పల్చగా అయినట్టయితే కాస్తా పిండిని కలుపుకోవాలి.
6.వేపుకోవాడానికి ప్యాన్ పై బటర్ వేసుకోని కలుపుకున్న కార్న్ వేసుకోవాలి.
7.లోఫ్లేమ్ పై కలుపుతూ వేపుకోవాలి.
8. కార్న్ క్రిస్పిగా వేగిన తర్వాత వేరొక ప్లేట్ లోకి తీసుకోని అందులోకి చాట్ మసాలా యాడ్ చేసుకోని సర్వ్ చేసుకోవాలి.