బిర్యానీలో ఉపయోగించే దినుసుల్లో జాజికాయ కూడా ఒకటి. జాజికాయలో కూడా రకాల పోషకాలు ఉంటాయి. జాజికాయను ఉపయోగించి ఎన్నో రకాల సాధారణ, దీర్ఘకాలిక సమస్యలను తగ్గించుకోవచ్చు.
జాజికాయలో మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం, కాపర్, విటమిన్లు బి1, బి6 వంటివి లభిస్తాయి.
జాజికాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిద్ర లేమి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే జాజికాయలో రిలాక్సింగ్ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒత్తిడి, నిద్ర లేమి సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పాలల్లో చిటికెడు జాజికాయ పొడి కలుపుకుని తాగితే చాలా మంచిది.
జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేవి బాగా పెరుగుతుంది. దీంతో అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి వస్తుంది. అంతేకాకుండా వైరస్, ఇన్ ఫెక్షన్లు సోకకుండా ఉంటాయి. చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
అంతే కాకుండా జాజికాయలో ఉండే కొన్ని సమ్మేళనాలు మెదడు పనితీరును కూడా మెరుగు పరుస్తాయి. జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచతాయి. మతి మరుపును దూరం చేస్తాయి. జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల డిప్రెషన్ నుంచి కూడా బయట పడతారు.
జాజికాయలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఇవి శరీర నొప్పులను నివారించడంలో చక్కగా హెల్ప్ చేస్తాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, తల నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు జాజికాయ తీసుకుంటే మంచిది.