వంటల్లో కరివేపాకు తీసి పక్కనపడేస్తున్నారా..? ఈ విషయం తెలిస్తే ఇకపై అలా చేయరు

www.mannamweb.com


దక్షిణాది వంటల్లో కరివేపాకు తప్పనిసరి. వంటల్లో కొన్ని కరివేపాకు రెబ్బలను జోడిస్తే అద్భుతమైన రుచి వస్తుంది. పైగా వండినప్పుడు అద్భుతమైన వాసన కూడా వస్తుంది.

కానీ వంట రుచిని పెంచడానికి మాత్రమే కాదు, ఈ కరివేపాకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి వివిధ ఉపయోగకరమైన పదార్థాలు ఇందులో అధికంగా ఉన్నాయి.

ఈ కరివేపాకు కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు, కొవ్వు తగ్గడం వంటి వివిధ శరీర వ్యాధులకు ఉపయోగిస్తారు. వంటకే కాదు నీళ్లలో కలిపి డిటాక్స్ డ్రింక్ కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకును రోజూ తింటే గుండె సమస్యలు దూరమవుతాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. కరివేపాకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో ‘చెడు’ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌ల స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.

కరివేపాకులో నానబెట్టిన నీరు శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను సహజ పద్ధతిలో తొలగించడానికి సహాయపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన ఈ విషపదార్థాలను తొలగించగలిగితే పొట్ట, చర్మం, జుట్టు మొదలుకుని అన్ని సమస్యలూ నయమవుతాయి. అధిక శరీర బరువు కూడా తగ్గుతుంది.

కొంతమంది జీర్ణ రుగ్మతలతో బాధపడుతుంటారు. అందుకు క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. అయితే కరివేపాకు నానబెట్టిన నీళ్లను తాగితే మాత్రం రకరకాల కడుపు సమస్యలు నయమవుతాయి. పైగా కరివేపాకు మలబద్ధకం నయం చేయడంలోనూ సహాయపడుతుంది

కరివేపాకులో కార్బజోల్, ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇది శరీరం నుండి అదనపు కొవ్వును తొలగించడానికి ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఆహారం, వ్యాయామంతో పాటు, కరివేపాకులను క్రమం తప్పకుండా ఉదయం ఖాళీ కడుపుతో లేదంటే వంటలో తినడం వల్ల కొవ్వు వేగంగా తగ్గుతుంది. అలాగే బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.