ఇవేవో పిచ్చి ఆకులు అనుకునేరు.. డైలీ ఇలా చేస్తే ఆ సమస్యలన్నీ మటుమాయమే..

www.mannamweb.com


భారతీయ ఆహారంలో ఉపయోగించే అనేక మసాలా దినుసులను ఆయుర్వేద ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు. గరం మసాలాలో ఉపయోగించే బిర్యానీ ఆకు మధుమేహాన్ని నియంత్రించడంలో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

బిర్యానీ ఆకులను తరచుగా ఆహారంలో ఉపయోగిస్తారు.. దీని రుచి, వాసన అద్భుతంగా ఉంటాయి.. ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు ఇందులో అనేక విటమిన్లు, మినరల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి.

బిర్యానీ ఆకుల్లో పొటాషియం, కాల్షియం, సెలీనియం, ఐరన్ ఇతర పోషకాలు ఉన్నాయి.. బిర్యానీ ఆకులను తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక షుగర్ సైతం తగ్గుతుంది. ఈ ఆకులను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక మధుమేహాన్ని కూడా నియంత్రించవచ్చు.

బిర్యానీ ఆకులోని పదార్థాలు ఆకు నొప్పి, మలబద్ధకం, అసిడిటీ, తిమ్మిరి వంటి కడుపు సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. బిర్యానీ ఆకు నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం, తలనొప్పి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.

మీరు నిద్రలేమితో బాధపడుతుంటే, కొన్ని చుక్కల బిర్యానీ ఆకు నూనెను కొంచెం నీటిలో కలిపి తీసుకుంటే నిద్రలేమి నుంచి బయటపడవచ్చు. అంతే కాదు, బిర్యానీ ఆకు నూనెతో మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.