అమరావతి నిర్మాణానికి డెడ్‌లైన్ ఫిక్స్.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..

www.mannamweb.com


రాజధాని అమరావతి నిర్మాణంపై శరవేగంగా అడుగులు వేస్తోంది.. కూటమి ప్రభుత్వం. వైసీపీ పాలనలో పడకేసిన రాజధాని పనులను..తిరిగి గాడిన పెట్టే చర్యలను చేపట్టింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు జరుగుతుండగా.. డిసెంబర్‌ 1నుంచి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని ప్రకటించారు మంత్రి నారాయణ. 60 వేల కోట్ల రూపాయల ఖర్చుతో చేపడుతున్న నిర్మాణాలను..నాలుగేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలో 26 జిల్లాలను ఏకకాలంలో అభివృద్ధి చేస్తామన్నారు నారాయణ.

అమరావతికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అమరావతిలో దట్టంగా పేరుకుపోయిన ముళ్ల కంపలు, చెత్తా చెదారాన్ని తొలగించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.రాజధాని పరిధిలోని 58 వేల ఎక‌రాలు, 99 డివిజ‌న్లలో ముళ్లకంప‌ల‌ తొలగింపు పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయిన తర్వాత రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభమవుతాయి. మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాలను ముందుగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది..ప్రభుత్వం. మరోవైపు అమరావతిలో ఇటీవల పర్యటించిన ప్రపంచబ్యాంక్‌, ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ బృందాలు.. రాజధాని నిర్మాణానికి రుణాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామని బడ్జెట్‌లో ప్రకటించింది.