కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వచ్చింది. యూనిఫామ్ అలవెన్స్‌ను మరింత సరళంగా పంపిణీ చేయాలనే దీర్ఘకాల డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఉద్యోగుల దుస్తులు లేదా ప్రత్యేక దుస్తులు కొనుగోలు చేయడానికి ఇచ్చే భత్యం(Dearness Allowance) ఇప్పుడు, సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటివరకు ఈ భత్యం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇచ్చేవారు. జూలై తర్వాత కేంద్ర ప్రభుత్వ సేవల్లో చేరే ఉద్యోగులు కూడా ఈ భత్యం ప్రయోజనాన్ని పొందుతారు. దీని అర్థం ఇప్పుడు ఈ భత్యం సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు లభిస్తుంది.
దుస్తుల భత్యం అంటే ఏంటి
ఆగస్టు 2017లో ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యూలర్ ప్రకారం, యూనిఫామ్ అలవెన్సులలో దుస్తుల భత్యం, ప్రాథమిక పరికరాల భత్యం, కిట్ నిర్వహణ భత్యం, రోబ్ అలవెన్స్, షూ అలవెన్స్ మొదలైనవి ఉన్నాయి. దుస్తుల భత్యం దామాషా చెల్లింపు సూత్రాన్ని ఉపయోగించి అందిస్తారు. మొత్తం / 12 x నెలల సంఖ్య (ప్రభుత్వ సేవలో చేరిన నెల నుంచి తదుపరి సంవత్సరం జూన్ వరకు). ఉదాహరణకు, ఒక ఉద్యోగి ఒక సంవత్సరం ఆగస్టులో సర్వీసులో చేరితే, అతనికి సంవత్సరానికి రూ. 20,000 దుస్తుల భత్యం లభిస్తుందని అనుకుందాం. ఈ ఫార్ములా ప్రకారం, అతను తన దుస్తుల భత్యాన్ని దామాషా ప్రాతిపదికన పొందుతాడు, అంటే రూ. (20,000/12 x 11), అంటే రూ. 18,333.
యూనిఫాం అలవెన్స్ ఎంత ఇస్తారు..
7వ వేతన సంఘం కింద, ప్రభుత్వం వివిధ వర్గాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేర్వేరు మొత్తాలను నిర్ణయించింది. ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, కోస్ట్ గార్డ్ అధికారులు సంవత్సరానికి రూ. 20,000 డ్రెస్ అలవెన్స్‌కు అర్హులు. ఇక ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ డయ్యూ, దాద్రా నాగర్ హవేలీ, పోలీస్ సర్వీస్‌లోని మిలిటరీ నర్సింగ్ సర్వీస్ (MNS) అధికారులు, పోలీస్ అధికారులు, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ సిబ్బంది, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ (ICLS), NIAలోని లీగల్ ఆఫీసర్లు, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ పర్సనల్ (ముంబై, చెన్నై, ఢిల్లీ, అమృత్‌సర్, కోల్‌కతాలో), బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ యొక్క అన్ని చెక్‌పోస్టులు వార్షిక యూనిఫాం అలవెన్స్‌కు అర్హులు.
ఎవరెవరికి ఎంత మొత్తం..
డిఫెన్స్ సర్వీసెస్/CAPFలు/రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్/యూనియన్ టెరిటరీ పోలీస్ ఫోర్సెస్, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ రైల్వేస్ స్టేషన్ మాస్టర్‌లలో ఆఫీసర్ ర్యాంక్ కంటే తక్కువ ఉన్న అన్ని సిబ్బందికి కూడా సంవత్సరానికి రూ. 10,000 యూనిఫాం అలవెన్స్ లభిస్తుంది. యూనిఫాం జారీ చేయబడిన దానిని క్రమం తప్పకుండా ధరించాల్సిన ఇతర కేటగిరీ ఉద్యోగులు, అంటే ట్రాక్‌మెన్, ఇండియన్ రైల్వేస్ రన్నింగ్ స్టాఫ్, స్టాఫ్ కార్ డ్రైవర్లు, నాన్-స్టాట్యూటరీ డిపార్ట్‌మెంటల్ క్యాంటీన్‌ల క్యాంటీన్ సిబ్బందికి రూ. 5,000 వరకు అర్హత ఉంటుంది.