Deeksha yadav: పెళ్లిలోనే.. 11 మంది పిల్లలు!

www.mannamweb.com


పెళ్లంటే నూరేళ్ల పంట. జీవితంలో ఒక్కసారే జరిగే ఈ వేడుకలో ఏకంగా 11 మంది అనాథ పిల్లలకు కొత్త జీవితం ఇచ్చిందో యువ జంట. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన దీక్షా యాదవ్‌ ఓ స్వచ్ఛందసంస్థను నిర్వహిస్తోంది.

పెళ్లంటే నూరేళ్ల పంట. జీవితంలో ఒక్కసారే జరిగే ఈ వేడుకలో ఏకంగా 11 మంది అనాథ పిల్లలకు కొత్త జీవితం ఇచ్చిందో యువ జంట. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన దీక్షా యాదవ్‌ ఓ స్వచ్ఛందసంస్థను నిర్వహిస్తోంది. తన పెళ్లి వేడుకకు ఓ పరమార్థం ఉండాలనుకుంది. కాబోయే భర్త కూడా సరేనన్నారు. వివాహ తంతు పూర్తవగానే పిల్లల్ని దత్తత తీసుకున్నారు.

ఇక వాళ్ల ఆలనా పాలనా, చదువు అన్నీ తామే చూస్తామని అతిథుల ముందు ప్రమాణం చేశారు. వారసత్వంగా వచ్చిన ఆస్తి పాస్తులు ఉండటంతో ఆ పిల్లల భవిష్యత్తుకిక ఢోకా ఉండదంటున్నారంతా. ఎంత వైభవంగా పెళ్లి చేసుకుంటే అంత గొప్ప అనుకునే రోజుల్లో ఈ జంట నిర్ణయాన్ని నెటిజన్లంతా ప్రశంసిస్తున్నారు.