వర్షా కాలంలో ఎక్కువగా వినిపించే వాటిల్లో జ్వరాలు కూడా ఒకటి. సీజ్ మారిందంటే ముందుగా ఎటాక్ చేసేది జ్వరం. ఈ జ్వరాల్లో డెంగ్యూ ఫీవర్ కూడా ఒకటి. దోమల కుట్టడం వల్ల వచ్చే వైరల్ ఇన్ ఫెక్షన్.
ఈ ఫీవర్ వచ్చిందంటే.. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. ఈ జ్వరం వచ్చిన వారిలో తీవ్రంగా రక్తస్రావం అవుతుంది. అలాగే ప్లేట్ లేట్స్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి డెంగ్యూ జ్వరం వచ్చిందంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డెంగ్యూ జ్వరం వచ్చిందంటే ఆహారం పట్ల మరింత కేర్ తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు పండ్ల, కూరగాయల రసాలు కూడా తీసుకుంటూ ఉండాలి. వీటి వలన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. డెంగ్యూ జ్వరం వచ్చినవారు ఖచ్చితంగా ఈ డ్రింక్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల తక్కువ సమయంలోనే పేషెంట్లు కోలుంటారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ రసం:
సొరకాయలతో చేసిన కూర అంటేనే చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ ఈ కూరగాయతో చేసిన రసం తాగితే డెంగ్యూ ఫీవర్ అనేది తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జ్వరం కారణంగా వచ్చే రక్త పోటుని తగ్గిస్తాయి. అంతే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచతాయి. ప్లేట్ లేట్స్ పెరుగుతాయి.
ద్రాక్ష రసం:
డెంగ్యూ జ్వరం ఉన్నవాళ్లు ద్రాక్ష రసం తీసుకోవడం వల్ల బలహీనత, నీరసం అనేవి తగ్గుతాయి. ఇమ్యూనిటీ వ్యవస్థను బల పరిచి.. డెంగ్యూతో పోరాడే శక్తిని ఇస్తాయి. రక్త పోటు పెరగకుండా చేస్తుంది. రక్తం పడుతుంది. అంతే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా శరీరానికి రక్షణగా నిలుస్తుంది.
నారింజ రసం:
డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు శరీర నొప్పులు అనేవి అధికంగా ఉంటాయి. కండరాల నొప్పులు కూడా ఎక్కువగా ఉంటాయి. నారింజ రసం తాగడం వల్ల కండరాల నొప్పులు అనేది తగ్గుతాయి. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి.. బలహీనతను దూరం చేస్తుంది. జ్వరాన్ని తగ్గించేందుకు సహాయ పడుతుంది. ప్లేట్ లెట్స్ పెరుగుతాయి.
బొప్పాయి రసం:
డెంగ్యూ జ్వరాన్ని కంట్రోల్ చేయడంలో బొప్పాయి ఆకులు, బొప్పాయి పండు ఎంతో హెల్ప్ చేస్తుంది. డెంగ్యూ జ్వరంలో ఉన్నవాళ్లు బొప్పాయి పండు జ్యూస్ తాగితే చాలా రిలీఫ్ వస్తుంది. తగ్గిన ప్లేట్ లేట్స్ పెరుగుతాయి. రక్తం కూడా పడుతుంది. శరీర నొప్పులు కూడా తగ్గుతాయి. శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)