ఈశాన్య రుతుపవనాలకు (Northeast monsoon) తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వల్ల ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి.
అల్ప పీడనం కాస్త వాయుగుండంగా మారి రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ (Meteorological department alert) జారీ చేసింది. అలాగే ఇప్పటికే వర్షాలు కురుస్తున్న జిల్లాలతో పాటు రేపు మరికొన్ని జిల్లాల్లో కుండపోత వానలు కురిసి.. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేసిన అధికారులు.. 14 జిల్లాలకు వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్స్ (Flash floods) హెచ్చరికలు జారీ చేసింది.
దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ (District Collector) ఆదేశాలతో రేపు కడప జిల్లాలోని (Kadapa District) అన్ని పాఠశాలలకు సెలవు (School holidays) ఇవ్వాలని డీఈవో నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలోని ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు, ఉప విద్యాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందులో వాతావరణ శాఖ జారీ చేసిన సూచనల మేరకు నిరంతరాయంగా కురుస్తున్న వర్షం కారణంగా కడప జిల్లాలోని (ప్రభుత్వ/ ప్రైవేటు) పాఠశాలలకు, అంగన్వాడీ పాఠశాలలకు రేపు అనగా 23-10-2025 వ తేదీన సెలవు దినం గా ప్రకటించడం జరిగిందని, ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకొవాలని డీఈఓ (DEO) స్పష్టం చేశారు.



































