ఉప ముఖ్యమంత్రి 2026 సమ్మర్‌ స్పెషల్‌

పీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్‌ హరి హర వీరమల్లు, ఓజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. వీరమల్లు సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయినా ఓజీ సినిమా మాత్రం ఫ్యాన్స్‌కి పండుగను తెచ్చి పెట్టింది.


అభిమానులు జాతర చూసినట్లుగా ఓజీ సినిమాను చూశారు. ఓజీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఓజీ సినిమాను తెగ చూస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఎప్పుడో ఒక సారి వస్తాయి అని అంతా భావించారు. కానీ హరీష్ శంకర్‌ దర్శకత్వంలో ప్రారంభం అయ్యి పెద్దగా షూటింగ్‌ జరగని ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా విడుదల అవుతుందని చాలా మంది కనీసం ఊహించలేదు. కానీ పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేకంగా సమయం తీసుకుని మరీ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాను సైతం పూర్తి చేసేందుకు రెడీ అయిన విషయం తెల్సిందే.

పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌…

ఇప్పటికే ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా షూటింగ్‌ మెజార్టీ పార్ట్‌ పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పూర్తి చేసేందుకు గాను దర్శకుడు హరీష్ శంకర్‌ తుది షెడ్యూల్‌కి ఏర్పాట్లు పూర్తి చేశాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాను డిసెంబర్‌ లో దాదాపు 20 రోజుల పాటు షూట్‌ చేసి పూర్తి చేయబోతున్నారు. ఆ సమయంలో పవన్‌ కళ్యాణ్ డేట్లు కూడా ఇవ్వబోతున్నారు. దాంతో సినిమాకి గుమ్మడి కాయ కొట్టడం ఖాయంగా ఉంది. మొదట ఈ ఏడాదిలోనే సినిమాను పూర్తి చేసి ఇదే ఏడాదిలో విడుదల చేయాలని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. దాంతో వచ్చే ఏడాదికి సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. డిసెంబర్‌లో సినిమా షూటింగ్‌ పూర్తి కాబోతున్న నేపథ్యంలో సినిమా ఎప్పుడు ఉంటుందా అనే చర్చ మొదలైంది.

రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు పెద్ది సినిమా..

చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా విడుదల తర్వాత కొన్ని వారాల గ్యాప్‌లోనే ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాను మొదట ఒక తమిళ సినిమాకు రీమేక్‌గా అనుకున్నారు. కానీ వరుస రీమేక్ ఫలితాల నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో కొత్త కథను తీసుకుని సినిమాను ఫ్రెష్‌ గా చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. దర్శకుడు హరీష్ శంకర్ గతంలో పవన్‌ కళ్యాణ్ తో గబ్బర్‌ సింగ్‌ సినిమాను చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఫలితం నేపథ్యంలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాపై సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది అనే విశ్వాసంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు.

ఓజీ సినిమా రేంజ్‌లోనే ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌

ఓజీ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ ను మరో షేడ్‌ లో చూపించిన దర్శకుడు సాహో సుజీత్‌. ఇక ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ లో ఫ్యాన్స్ కి పవన్‌ మరో యాంగిల్‌ను దర్శకుడు హరీష్ శంకర్‌ చూపిస్తాడు అనే విశ్వాసం ప్రతి ఒక్కరి ఉంది. 2026 సమ్మర్‌ లో ఉప ముఖ్యమంత్రి గారి పెద్ద కమర్షియల్‌ మాస్‌ ట్రీట్‌ ఉంటుంది అంటూ ఫ్యాన్స్‌ తో పాటు ప్రతి ఒక్కరూ చాలా నమ్మకంగా ఉన్నారు. కథ, కథనం విషయంలో ఎలా ఉన్నా హీరోను చూపించే విషయంలో హరీష్ శంకర్‌ కాస్త ఎక్కువ శ్రద్ద పెట్టాలి అంటూ అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. సుజీత్‌ ఎలా అయితే ఎలివేషన్ సీన్స్ ఇచ్చాడో అలాగే ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌లోనూ ఉప ముఖ్యమంత్రి గారి ఎలివేషన్ సీన్స్ ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్‌లో సినిమా షూటింగ్‌ పూర్తి చేసి, అదే సమయంలో టీజర్ లేదా ఏదైనా విడుదల చేసి, సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.