Devotional: దేవుడు మనతో ఉన్నాడని ఎలా తెలుస్తుంది.. సంకేతాలు ఏమైనా కనిపిస్తాయా?

మామూలుగా చాలామంది దేవుడికి పూజలు చేస్తున్నాము. ఆ దేవుడు కరుణించాడని ఎప్పుడు తెలుస్తుంది. ఆ దేవుడు మనతో ఉన్నాడా లేదా అని ఎలా తెలుసుకోవాలి అని సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు.


అయితే దేవుడు మనతో ఉన్నాడు అని తెలుస్తుందని అందుకు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు. మరి ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అనుకోకుండా బ్రహ్మ ముహూర్తంలో ఎవరి ప్రమేయం లేకుండా మెలకువ వస్తే దేవుడు మీతో ఉన్నట్టే అని అర్థం. కొంతమందికి ఈ ముహూర్తంలో నిద్రలేచే అలవాటు ఉంటుంది.

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేయడం దైవరాధన చేయడం వంటివి చేయడం వల్ల దేవుడు ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాడట. ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కష్టాలు రాకూడదని సంతోషమే కావాలని కోరుతూ ఉంటారు. అయితే ఎలాంటి కారణం లేకుండా కొన్ని కొన్ని సార్లు సంతోషం వస్తూ ఉంటుంది. అలా ఉన్నాము అంటే దేవుడు ఆశీర్వాదం ఉన్నట్టే అని చెబుతున్నారు పండితులు. ఏదైనా ఒక పని చేయడానికి తలపెట్టినప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఆ పనిని పూర్తీ చేయగలిగితే దేవుడి ఆశీర్వాదం మీకు ఉన్నట్టే అని చెబుతున్నారు. దేవుడి అనుగ్రహం లేనిది ఏ పని జరగదు అని చెబుతున్నారు. కొందరు ఏదైనా పని చేస్తున్నా, నిశ్శబ్దంగా ఉన్నా, వేరే ఆలోచనలలో ఉన్నా వారిలో అంతర్లీనంగా ఏదో ఒక మంత్రం చదువుతున్నట్టు వారికి అనిపిస్తూ ఉంటుంది.

ముఖ్యంగా చాలామందికి “ఓం” అనే ప్రణవనాదం వినబడినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా కలలో దేవుడు కనిపించడం, దేవుడి మంత్రాలు, శ్లోకాలు చదువుతున్నట్టు అనిపించడం మొదలైనవి కూడా దేవుడి ఆశీర్వాదం ఉన్నవారికే జరుగుతాయని చెబుతున్నారు. అలాగే జీవితంలో దేవుడి అనుగ్రహం ఉంటే ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుందట. ఆర్థిక సమస్యలు మెల్లగా మాయమవుతాయట. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ అవే సర్థుకుంటాయని చెబుతున్నారు. కొత్త అవకాశాలు కూడా వస్తాయట. తినడానికి, జీవితం గడవడానికి ఎలాంటి లోటు ఉండదట. ఇవన్నీ జరిగితే మాత్రం దేవుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ వెంట ఉందని అర్థం అంటున్నారు.