Diabetes: అలర్ట్.. డయాబెటిస్‌ను కంట్రోల్ చేసే ఏడు సూత్రాలు.. ఇలా చేస్తే 400 ఉన్న షుగర్‌ 100కు రావడం ఖాయం..

www.mannamweb.com


ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. హార్మోన్ల కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు మీ శరీరంలో వేళ్లూనుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు, థైరాయిడ్ హార్మోన్లలో హెచ్చుతగ్గులు హైపో లేదా హైపర్ థైరాయిడిజానికి దారితీస్తాయి.
అదేవిధంగా, ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కాకపోయినా లేదా సరిగ్గా పని చేయకపోయినా, రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా ఉండవు. చాలా సందర్భాలలో, చక్కెర స్థాయి పెరుగుతుంది. దీనివల్ల మధుమేహం, ప్రీ-డయాబెటిస్, టైప్-2 మధుమేహం వంటి సమస్యలు వస్తాయి. మధుమేహంతో పాటు, ఇన్సులిన్ నిరోధకత కొలెస్ట్రాల్ స్థాయిలు, థైరాయిడ్ పనితీరు, రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆహారం ద్వారా ఇన్సులిన్ హార్మోన్ స్థాయిలను నిర్వహించవచ్చు.. అలాంటి ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకోండి..

ఏడు సూత్రాలతో డయాబెటిస్ కు చెక్..
మెంతులు – దనియాల నీరు:
మెంతులు, దనియాల నీటిని రోజూ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ హార్మోన్ స్థాయిలు అదుపులో ఉంటాయి. 1/2 టీస్పూన్ మెంతి గింజలు, 1 టీస్పూన్ దనియాలను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి తాగండి.. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. గుండెల్లో మంటగా ఉన్నా.. అజీర్ణంతో బాధపడుతున్నా ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది.

ఉసిరి – అలోవెరా జ్యూస్: ఉసిరి, కలబంద రెండూ ఇన్సులిన్ నిరోధక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ పానీయంలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి, పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఈ పానీయం రక్తంలోని అదనపు గ్లూకోజ్‌ను గ్రహిస్తుంది.

సరైన పద్ధతిలో ఆహారాన్ని తినండి: ఆహారంలో సరైన మొత్తంలో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఉండాలి. రోజు ప్రారంభంలో ఫైబర్ తీసుకోండి. ఆ తర్వాత ప్రోటీన్.. చివరకు పిండి పదార్థాలు లాంటివి తీసుకోవాలి.. అయితే. మితంగా తినడం మాత్రం మర్చిపోవద్దు..

ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారం:
శరీరంలో ప్రొటీన్ల లోపాన్ని తీర్చడానికి గుడ్లు, చికెన్, బాదం, కాజు, పప్పులు వంటివి తినండి.. ఇటువంటి ఆహారాలు ఇన్సులిన్ హార్మోన్ ప్రభావాన్ని పెంచుతాయి. రోజులో ఏదైనా భోజనంలో ప్రొటీన్ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే బ్లడ్ షుగర్ లెవెల్ మెయింటెయిన్ అవుతుంది.

దాల్చిన చెక్క నీరు:
దాల్చిన చెక్క ఇన్సులిన్ నిరోధకత.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో గ్రేట్ గా పనిచేస్తుంది. ఈ మసాలాలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. దాల్చిన చెక్క పొడిని వేడి నీటిలో మరిగించి తాగాలి.. రోజులో ఏదో ఒకపూట ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

పుష్కలంగా నీరు త్రాగండి:
ఇన్సులిన్ హార్మోన్ స్థాయిలను నిర్వహించడానికి.. వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి పుష్కలంగా నీరు త్రాగాలి. రోజంతా 3-4 లీటర్ల నీరు త్రాగాలి.. దీనివల్ల హైడ్రేట్‌గా కూడా ఉంటాం..

రాత్రి భోజనం తర్వాత నడవండి:
రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకోకండి. రాత్రి భోజనం తర్వాత కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు నడవండి. ఇది ఆహారాన్ని జీర్ణం చేస్తుంది.. వ్యాధి ప్రమాదాన్ని నివారిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.