మధుమేహం అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి.. దీని బారిన పడేవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రస్తుతం చాలా మంది ఈ దీర్ఘకాలిక వ్యాధి బారిన పడి మరణిస్తున్నాయి.
అయితే ఈ సమస్యతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ మధుమేహం అనేది రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండడం వల్ల వస్తుంది. అలాగే ప్రీడమాబెటిస్ ఉన్నవారికి ఎలాంటి లక్షణాలు ఉండవు.. కాబట్టి ముందుగానే పలు రకాల జాగ్రత్తలు పాటించి జీవితాన్ని ముందుకు సాగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆధునిక జీవనశైలికి కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయితే మధుమేహం ఉన్నవారిలో కొన్ని లక్షణాలు వస్తూ ఉంటాయి.
మధుమేహం వచ్చే ముందు కనిపించే లక్షణాలు:
తరచుగా మూత్ర విసర్జన (Frequent Urination):
మధుమేహం వచ్చే ముందు ఏర్పడే లక్షణాల్లో మొదటిది తరచుగా మూత్ర విసర్జన.. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరగడం వల్ల కిడ్నీలు శరీరంలో ఎక్కువ చక్కెర పరిమాణాలను తొలగించేందుకు కష్టంగా మారుతుంది. దీని ఫలితంగా ఎక్కువ మూత్రం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
అధిక ఆకలి (Increased Hunger):
ప్రీడయాబెటిస్‌తో బాధపడేవారిలో అనేక లక్షణాలు వస్తాయి. ఇందులో ముఖ్యంగా ఆహారంలో నుంచి వచ్చే గ్లూకోజ్‌ను శరీరం సరిగ్గా వినియోగించుకోలేకపోతుంది. దీని వల్ల కణాలు శక్తిని కోల్పోతాయి. ఈ ప్రభావం ఆకలిపై పడుతుంది. దీంతో నిరంతరం ఆకలి అనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పరిస్థితిని వైద్య శాస్త్రం ప్రకారం, పాలిఫేజియా అని అంటారని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
అధిక దాహం (Increased Thirst):
తరచుగా మూత్ర విసర్జన చేయడం వల్ల శరీరం డీహైడ్రేట్‌గా తయారువుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా ఎల్లప్పుడూ దాహంగా అనిపించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు సాధారణం కంటే ఎక్కువ మోతాదులో నీరు తాగే ఛాన్స్ కూడా ఉంది. ఇలాంటి లక్షణాన్ని పాలిడిప్సియా అని అంటారు.
చూపు మందగించడం (Blurred Vision):
అధిక రక్త చక్కెర స్థాయిలు కంటి చూపుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. దీని కారణంగా కొంతమందిలో కళ్ళలోని చిన్న రక్త నాళాలను ప్రభావితమవుతాయి. అంతేకాకుండా చూపు తాత్కాలికంగా మందగించే ఛాన్స్‌లు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి కంటే మరింత పెరిగినప్పుడు చాలా మందిలో అనేక రకాల కంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
విపరీతమైన అలసట (Unexplained Fatigue):
కొంతమందిలో రక్తంలో చక్కెర స్థాయిలు నిరంతరం పెరగడం, తగ్గడం వల్ల భారీ మొత్తంలో అలసట, బలహీనత వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొంతమందిలో శరీరం గ్లూకోజ్‌ను సమర్థవంతంగా శరీరం వినియోగించకపోవడం వల్ల ఒత్తిడి, అలసిపోవడంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యల రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.