కోహినూరు వజ్రం అసలు యజమానులు ఎవరు?

www.mannamweb.com


వ‌జ్రం అంటే చాలా మందికి ఠ‌క్కున గుర్తొచ్చేది కోహినూర్‌ వజ్రం. ( Kohinoor Diamond ). దీన్ని వ‌జ్రాల్లో రారాజుగా కూడా చెబుతుంటారు. ఎందుకంటే ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన వ‌జ్రంగా రాజ్యమేలుతుంది. కొన్ని వేల ఏండ్ల చ‌రిత్ర క‌లిగిన ఈ కోహినూర్ వ‌జ్రం చాలా చరిత్రను కలిగి ఉంది. మ‌న తెలుగు నేల‌పై దొరికిన ఈ వ‌జ్రం కోసం చ‌రిత్ర‌లో చాలా యుద్ధాలు కూడా జ‌రిగాయి. ఈ క్ర‌మంలో ఎన్నో రాజ‌వంశాల చేతులు మారింది ఇది. చివరకు మ‌న భార‌త‌దేశం దాటి బ్రిట‌న్ చేరింది.

కోహినూర్ వజ్రం అనగానే చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ పేరు వింటే ఇప్పుడు చాలా మందిలో బాధ కలుగుతుంది. దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే ఈ విలువైన వజ్రం ఒకప్పుడు భారతదేశానికి చెందినది. కానీ ఇప్పుడు చేతులు మారి ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయింది. ఇక ఈ కోహినూర్ డైమండ్ చాలా మంది చేతులు మారింది. కోహినూర్ కి ఒక సుదీర్ఘమైన, ఆసక్తికరమైన కథ కూడా ప్రాచూర్యంలో ఉంది. దీని ప్రయాణం భారతదేశం నుంచి ఇంగ్లాండ్ వెళ్లి రాణి కిరీటంలో చేరడంతో మాత్రమే ఈ చరిత్ర ముగియలేదు.

కొహినూరు వజ్రాన్నిఎవరు కొన్నారు అనుకుంటున్నారా? కానీ ఈ వజ్రాన్ని అసలెవ్వరూ కొనలేదట. అంతేకాదు దీన్ని ఇప్పటి వరకు ఎప్పుడూ ఎవరూ కొనగోలు మాత్రమే కాదు అమ్మలేదు కూడా. దీన్ని ఎల్లప్పుడూ బహుమతిగా ఇస్తుంటారు. లేదంటే యుద్ధంలో గెలుచుకున్నప్పుడు దీన్ని బహుమతిగా గెలిచారు. ఇక ఈ కోహినూర్ వజ్రం అసలు యజమాని ఎవరు అనే సందేహాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. ఇక దీని గురించి చరిత్రలో, వార్తల్లో చాలా విని ఉంటారు, చదివుంటారు. కానీ ఈ వజ్రం అసలు యజమాని ఎవరో చాలా మందికి తెలియదు.

అయితే ఈ కోహినూర్ వజ్రం కాకతీయ రాజులది అని సమాచారం. వారు దీన్ని భద్రకాళీ దేవికి అలంకరించేవారని చరిత్ర చెబుతుంది. ఢిల్లీ సుల్లాన్ల చేతిలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో సంధి భాగంగా అపారమైన సంపదతో పాటు కోహినూర్‌ వజ్రాన్ని కూడా ఢిల్లీ సుల్తాన్ లకు ఇచ్చారట రాజు.

కోహినూర్ వజ్రం దాదాపు 800 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనిలో లభించిందట. దీని బరువు 186 క్యారెట్లు అని సమాచారం. అయితే అప్పట్లో అతిపెద్ద వజ్రం కూడా ఇదే. ఇక 14వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ కాకతీయ రాజులపై దాడి చేసి ఈ వజ్రాన్ని దిక్కించుకున్నారు అని సమాచారం. ఆ తర్వాత అనేకమంది చేతులుమారింది ఈ వజ్రం. చివరకు బ్రిటిష్ వారి దగ్గరకు చేరింది. వాళ్లు తమ మహారాణి కిరీటంలో పొందుపరిచారట. నేటికీ కోహినూర్ వజ్రం ప్రపంచవ్యాప్తంగా ఐశ్వర్యానికి ప్రతీకగా నిలుస్తుంది.