తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చిందా..? ఇకపై మొబైల్ స్క్రీన్‌పై వారి పేరు తెలుసుకోవచ్చు.. ఎలా అంటే..?

ప్పటివరకు మీ ఫోన్‌కు ఎవరైనా తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చినప్పుడు వాళ్లు ఎవరనేది తెలుసుకోవడం కష్టం. ట్రూ కాలర్ లాంటి యాప్స్ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చినప్పుడు వారి పేరు గుర్తించవచ్చు.


అయితే ఇప్పుడు ట్రూ కాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండానే మీకు ఆటోమేటిక్‌గా తెలియని వ్యక్తి పేరు కనిపిస్తుంది. టెలికాం కంపెనీలే నేరుగా ఇలాంటి తరహా ఫీచర్‌ను తీసుకొస్తున్నాయి. దీని వల్ల స్పామ్ కాల్స్, తెలియని వ్యక్తి కాల్స్‌ను సులువుగా గుర్తు పట్టవచ్చు.

కాలర్ నేమ్ ప్రెజెంటేషన్

కాలర్ నేమ్ ప్రెజెంటేషన్ అనే కొత్త సేవను టెలికాం కంపెనీలన్నీ తీసుకొస్తున్నాయి. దీని వల్ల మీకు ఎవరైనా తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చినప్పుడు వారి నెంబర్‌తో పాటు పేరు కూడా డిస్‌ప్లేపై కనిపిస్తుంది. ఇప్పటికే జియో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఇక ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ కూడా ఇలాంటి సర్వీసులు అందించాలని ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో త్వరలో అన్ని టెలికాం కంపెనీల వినియోగదారులు ఈ ఫీచర్‌ను పొందనున్నారు.

పలు రాష్ట్రాల్లో అమల్లోకి

జియో ఇప్పటికే రాజస్థాన్, పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో కాలర్ నేమ్ ప్రెజెంటేషన్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఇక ఎయిర్‌టెల్ జమ్మూకశ్మీర్, గుజరాత్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్‌లో దీనిని ప్రారంభించింది. ఇక వొడాఫోన్ ఐడియా మహారాష్ట్ర, తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో ఈ ఫీచర్‌ను తెచ్చింది. ఇక బీఎస్ఎన్‌ఎల్ పశ్చిమబెంగాల్‌లో టెస్టింగ్ చేస్తోంది.

అసలు పేరు చూపిస్తుంది

ట్రూ కాలర్‌లో తెలియని వ్యక్తి పేరును గుర్తించడం కష్టం. ఎందుకంటే అందులో మన పేరును మనకి నచ్చినట్లు మార్చుకోవచ్చు. అయితే టెలికాం కంపెనీలు అందించే ఈ సేవలో అలా ఉండదు. వినియోగదారులుడు సిమ్ కార్డు తీసుకునేటప్పుడు అందించే పత్రాల ఆధారంగా పేరు నిర్ధారించారు. ఆ పేరునే ఫోన్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.