ప్రస్తుత కాలంలో ప్రతి మొబైల్ లో వాట్సాప్ తప్పనిసరిగా ఉంటుంది. విద్యార్థుల నుంచి ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు అందరూ వాట్సాప్ తోనే చాటింగ్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ, స్నేహితులు, ఉద్యోగులు ఇలా అందరూ ఆన్లైన్లో కలుసుకునే వేదికగా వాట్సాప్ ప్రధానంగా నిలుస్తుంది. వాట్సాప్ ద్వారా కేవలం సాధారణ మెసేజ్లు మాత్రమే కాకుండా కంపెనీకి సంబంధించిన విలువైన మెసేజ్లను కూడా పంపిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో వాట్సాప్ వాడేవారు జాగ్రత్తగా ఉండాలని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. అయినా కొందరు సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతిలో మోసాలు చేస్తున్నారు. తాజాగా వాట్సాప్ లో కొత్తరకం మోసం బయటపడింది. అదేంటంటే?
వాట్సాప్ లో వినియోగదారుల ప్రవేశిక కోసం మాతృ సంస్థ మేధా ఎప్పటికప్పుడు సేఫ్టీ ఫీచర్స్ను అందుబాటులో ఉంచుతుంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్స్ ను అందుబాటులోకి తెచ్చిన మెటా వినియోగదారుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కొత్తగా ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా వాట్స్అప్లో వినియోగదారులు మోసపోయే ప్రమాదం ఉందని గుర్తించింది.
ఇప్పటికే గుర్తుతెలియని మెసేజ్లను ఓపెన్ చేయవద్దని సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు. అలాగే. Apk వంటి మెసేజ్లు కూడా వినియోగదారుల ఖాతాలను ఖాళీ చేస్తాయని అప్రమత్తం చేసింది. అయితే తాజాగా కొత్త రకం మోసాన్ని బయటపెట్టింది. కొందరు సైబర్ నేరగాళ్లు ఒక ఇమేజ్ ని పంపిస్తారు. బైనరీ కోడ్ తో ఉన్నాయి ఇమేజ్ ని ఓపెన్ చేయగానే మాల్వేర్ మొబైల్ లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత వినియోగదారుడి ఖాతాకు సంబంధించిన సమాచారం సైబర్ నేరగాళ్లకు వెళ్లిపోతుంది. దీంతో ఓటీపీ వంటి మెసేజ్లు హ్యాక్ కు గురి అవుతాయి. అందువల్ల గుర్తుతెలియని ఫోన్ నెంబర్ నుంచి వచ్చే ఇమేజ్ ని ఓపెన్ చేయవద్దని సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఇమేజ్ ని ఉపయోగించి మోసపోయారని గుర్తించింది. అందువల్ల ఇకనుంచి అయినా జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ సైతం హెచ్చరిస్తోంది.
అయితే వాట్సాప్ లో సేఫ్టీ కోసం ఎన్నో రకాల ఫీచర్స్ ఇప్పటికీ అందుబాటులోకి వచ్చాయి. అయినా కొందరు వినియోగదారుల అవగాహన లేని తో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో వాట్సాప్ లో ఉపయోగించేవారు గుర్తుతెలియని గ్రూపులో గానీ గుర్తు తెలియని నెంబర్లో గాని చాటింగ్ చేయవద్దని చెబుతున్నారు. గుర్తుతెలియని నియమాలలో మినిమం మెసేజ్ పెట్టిన వారికి వాట్సాప్ ఇన్ఫర్మేషన్ వెళ్లిపోతుందని అంటున్నారు. అంతేకాకుండా మొబైల్ కి సంబంధించిన సమాచారం సైబర్ నేరగాళ్లు తెలుసుకునే ప్రమాదముంది.
మరోవైపు వినియోగదారుల ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్నో రకాల ఫీచర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే వీటిని ఉపయోగించే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. వీడియో లింకులతోనూ కొందరు ఓన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. తెలిసిన గ్రూపుల్లోనూ కొందరు ఇలాంటి రకమైన మెసేజ్లు ఉంచడం వల్ల అవగాహన లేకుండా వాటిని ఓపెన్ చేస్తున్నారు. ఇకనైనా ఇలాంటి మెసేజ్లు విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.






























