అనారోగ్యకరమైన జీవనం, క్రమరహిత ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి పలురకాల జీవనశైలి కారణాలు ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తాయి. ఇందులో కొలెస్ట్రాల్, డయాబెటిస్ కూడా ఉన్నాయి. శరీరంలో వీటి అసమానతల కారణంగా మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తాయి. వైద్యుల ప్రకారం.. నేటి కాలంలో 30, 40 ఏళ్లు నిండకముందే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. యువతలో ఎక్కువగా కనిపించే సమస్య కిడ్నీలో రాళ్లు..
అనారోగ్యకరమైన జీవనం, క్రమరహిత ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి పలురకాల జీవనశైలి కారణాలు ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తాయి. ఇందులో కొలెస్ట్రాల్, డయాబెటిస్ కూడా ఉన్నాయి. శరీరంలో వీటి అసమానతల కారణంగా మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తాయి. వైద్యుల ప్రకారం.. నేటి కాలంలో 30, 40 ఏళ్లు నిండకముందే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. యువతలో ఎక్కువగా కనిపించే సమస్య కిడ్నీలో రాళ్లు. పసుపు రంగులో లేదా ఎర్రటి రంగులో మూత్రం రావడం, దిగువ వీపులో నొప్పి, వికారం వంటివి మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నాయని సూచించే లక్షణాలు. కిడ్నీలో రాళ్లు ఉంటే నొప్పిని భరించాల్సిందే. సకాలంలో కిడ్నీ సమస్యలకు జాగ్రత్తలు తీసుకోకపోతే కోలుకోవడానికి సర్జరీ తప్పనిసరి అవుతుంది.
కిడ్నీ స్టోన్స్ ప్రధానంగా జీవనశైలి కారణంగా పేరుకుపోతాయి. తగినంత నీరు త్రాగకపోవడం నుంచి అనారోగ్యకరమైన ఆహారం తినడం వరకు అన్నీ కిడ్నీ సమస్యలను తీవ్రతరం చేస్తాయి. అలాగే ఆహారంలో ఆక్సలేట్, కాల్షియం అధికంగా ఉన్నా రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది. అయితే కిడ్నీలో రాళ్లను ఆహారం ద్వారా కూడా నివారించవచ్చు. ఈ కింది ఆహారాలు తినడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు..
సిట్రస్ పండ్లు
నిమ్మ, నారింజ, ముసాంబి, నిమ్మకాయలు వంటి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. సిట్రస్ పండ్లు డిటాక్సిఫైయర్‌లుగా పనిచేస్తాయి. ఇది మూత్రపిండాల పనితీరును పెంచుతుంది.
తగినంత నీరు త్రాతాలి
కిడ్నీ సమస్యలను నివారించడానికి పుష్కలంగా నీరు త్రాగాలి. మూత్రపిండాల పనితీరు శరీరం నుంచి విషాన్ని తొలగించడం. తగినంత నీరు త్రాగకపోతే ఇది సాధ్యం కాదు.
ఆహారంలో ఉప్పు తగ్గించాలి
చాలా మంది ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు తింటారు. ఇలా అదనపు ఉప్పు తినే అలవాటు మూత్రపిండాల సమస్యలను పెంచుతుంది. ఉప్పులో సోడియం ఉంటుంది. దీనిని మూత్రపిండాలు శరీరం నుంచి తొలగించలేవు. దీంతో కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి. సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.
కాఫీ వద్దు
ముఖ్యంగా వేసవిలో కాఫీ అలవాటు మరింత హాని తలపెడుతుంది. కిడ్నీ సమస్యలు ఉంటే కాఫీకి దూరంగా ఉండాలి. కాఫీలో చాలా కెఫిన్ ఉంటుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది.