Digestive system: భోజనం చేశాక ఆహారం త్వరగా అరగట్లేదా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

www.mannamweb.com


జీవితంలో ఆరోగ్యం కాపాడుకోవడమే గగనంలా మారిపోయింది. పని, ఆందోళన, కష్టాలు మన తిండి సమయాలనూ మార్చేస్తాయి. ఏ పూట తింటారో తెలియదు. ఏ సమయాల్లో తింటారో తెలియదు.
అందుకే చాలామందికి జీర్ణ సమస్యలు (digestive problems) వస్తాయి. ఎన్నో అనారోగ్యాల పాలవుతారు. కరోనా ఒక్కసారిగా మీద పడటంతో అందరి జీవితాలు తలకిందులయ్యాయి.

వైద్యం కోసం ఆసుపత్రులు (hospitals) తిరగాల్సి వచ్చింది. ఉద్యోగాలు ఊడిపోయాయి. ఆర్థిక కష్టాలు (financial problems) మీద పడ్డాయి. సమయానికి నిద్ర పోవడం లేదు. వేళకు తినడం లేదు.

రాత్రిళ్లు ఇంట్లో ఆహారం కాకుండా ఫాస్ట్​ఫుడ్​ వెంట పడుతున్నారు జనం. అయితే ఫాస్ట్​ఫుడ్ (fast food) తో జీర్ణం కాక… అధిక బరువు పెరగడం.. ఒక్కటేమిటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు (health problems) తలెత్తుతున్నాయి.

గ్యాస్‌ , అసిడిటీ ..

ఇక మనం తినే ఆహారాలను జీర్ణం చేయడంతో పాటు వాటిలో ఉండే పోషకాలను మన శరీరానికి అందేలా చూడటంలో జీర్ణ వ్యవస్థ (digestive system) పాత్ర చాలా కీలకమైంది.

దీంతోపాటు ఆ ఆహార పదార్థాల్లో ఉండే వ్యర్థాలను కూడా జీర్ణవ్యవస్థ బయటకు పంపుతుంది. అయితే జీర్ణవ్యవస్థ పనితీరు సరిగ్గా లేకపోతే గ్యాస్‌ (gas), అసిడిటీ (acidity), కడుపు నొప్పి (stomach pain), అజీర్ణం, విరేచనాలు తదితర సమస్యలు వస్తుంటాయి.

ఈ క్రమంలోనే జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుచుకునేందుకు, తిన్న ఆహారం (food) సరిగా జీర్ణం అవడానికి కింద తెలిపిన ఆహారాలను నిత్యం తీసుకోవాలి. దీంతో జీర్ణం బాగా అవడమే కాదు, ఆయా జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

సోంపు గింజల్లో ఉండే ఫైబర్..

యాపిల్ (apple) పండ్ల (fruits)లో పుష్కలంగా ఉండే పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్ (fiber) జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేందుకు దోహదపడుతుంది.

కనుక నిత్యం యాపిల్ పండ్లను తినడం (eat fruits) వల్ల జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

సోంపు గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణాశయంలో ఆహారం కదలికను సరిచేస్తుంది. దీంతో కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్ రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది (digest).

నిత్యం ఉదయాన్నే అల్పాహారానికి ముందు (before breakfast) కొద్దిగా అల్లం రసం (ginger juice) సేవిస్తే.. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.

అలాగే వికారం, వాంతులు (vomiting’s) తగ్గుతాయి. గ్యాస్‌, అసిడిటీ రాకుండా ఉంటాయి.

భోజనానికి ముందు పుదీనా రసం తీసుకుంటే జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం 9food) సరిగ్గా జీర్ణమవుతుంది, విరేచనాలు ఆగుతాయి.