సీనియర్ సిటిజన్లకు డిజిటల్ కార్డులు

ఏపీలో సీనియర్ సిటిజన్లకు డిజిటల్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. 58 ఏళ్లు నిండిన వృద్ధులకు ఈ కార్డులు ఇవ్వనున్నారు. దీనివల్ల సీనియర్ సిటిజన్లకు అనేక ప్రయోజనాలు దక్కనున్నాయి.


ఈ కార్డు పొందేందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగానే పొందవచ్చు.

ఈ కార్డు ద్వారా ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ పొందవచ్చు. సీనియర్ సిటిజన్ కార్డు కలిగి ఉంటే కోర్టుల్లో కేసుల విచారణలోనూ ప్రాధాన్యత లభిస్తుంది. పాస్‌పోర్ట్ సేవా ఫీజుల్లో 10 శాతం రాయితీ పొందవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లపై 0.5 శాతం అదనపు వడ్డీ లభిస్తుంది. 80 ఏళ్లు దాటితే 1 శాతం వడ్డీ అదనంగా ఉంటుంది.

ఈ కార్డు కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆఫీసులో కూడా పొందవచ్చు. ఏ రోజు అప్లై చేసుకుంటే ఆ రోజే కార్డు మంజూరు చేస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకుంటే సెక్షన్ 80 సి కింద మినహాయింపు పొందవచ్చు.

మందులు, డయాగ్నోస్టిక్ టెస్ట్స్‌లలో రాయితీలు అలాగే ఇండియన్ రైల్వే సంస్థ రైలు ప్రయాణంలో రాయితీ లభించనుంది. ఈ కార్డు ద్వారా ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ పొందవచ్చు.