నిస్సాన్ ఇండియా గొప్ప పండుగ ఆఫర్లతో ముందుకు వచ్చింది. రూ.6లక్షల కారుుపై రూ .1.25 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. మరోవైపు కొత్త మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్‌ను విడుదల చేయనుంది.
నిస్సాన్ ఇండియా తన మాగ్నైట్ ఎస్‌యూవీపై ఈ నెలలో గొప్ప పండుగ ఆఫర్లతో ముందుకు వచ్చింది. ఈ కారుపై కంపెనీ రూ .1.25 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. అక్టోబర్ 4న కంపెనీ కొత్త మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్‌ను విడుదల చేయనుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాత స్టాక్‌ను క్లియర్ చేసేందుకు భారీ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. మాగ్నైట్ ఎక్స్-షోరూమ్ ధర రూ .6 లక్షల నుండి రూ .10.66 లక్షల వరకు ఉంటుంది. అంటే టాప్ మోడల్ కొనుగోలుపై కస్టమర్లకు భారీ డిస్కౌంట్ లభిస్తుంది. భారత మార్కెట్లో మాగ్నైట్ హ్యుందాయ్ ఎక్స్‌టర్, టాటా పంచ్, మారుతి ఫ్రాంక్స్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.
నిస్సాన్ మాగ్నైట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఈ కారులో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 100బిహెచ్‌పీ పవర్, 160ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎంపికను కూడా పొందుతుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 71 బీహెచ్‌పీ పవర్, 96 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిషన్‌తో వస్తుంది.
డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, స్మార్ట్ కనెక్టివిటీ, ఎరౌండ్ వ్యూ మానిటర్ వంటి అనేక భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఏబీఎస్, ఈబీడీ, హెచ్‌ఎస్‌ఏ, హెచ్‌బీఏ వంటి ఫీచర్లు, 7 అంగుళాల టీఎఫ్ టీ స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వైర్ లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ మూడ్ లైటింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
2024 నిస్సాన్ మాగ్నైట్ ఫీచర్లు
2024 నిస్సాన్ మాగ్నైట్ అప్‌డేట్‌గా వస్తుంది. కొత్త ఫ్రంట్ బంపర్, రీడిజైన్ చేసిన హెడ్ లైట్ హౌసింగ్‌ను ఇది పొందుతుంది. సింగిల్ ప్యాన్ సన్‌రూఫ్‌తో కూడిన 9 అంగుళాల టచ్ స్క్రీన్ వంటి ఫీచర్లు దీని క్యాబిన్‌లో ఉండనున్నాయి. అంతకుముందు కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఇండియా ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ సెంటర్లో కనిపించింది.
2024 నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్‌టీరియర్‌లో కూడా అనేక మార్పులు జరిగాయి. కొత్త గ్రిల్ డిజైన్, రివైజ్డ్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, ఎల్ ఆకారంలో ఉన్న ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు, అప్డేటెడ్ టెయిల్ లైట్లతో రివైజ్డ్ ఫ్రంట్ ఫ్యాసియా లభిస్తుంది. ఇది 7-స్పోక్ డిజైన్‌లతో కొత్త అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది.
గమనిక : వివిధ ప్లాట్‌ఫామ్‌లలో వచ్చిన సమాచారం సహాయంతో కారుపై డిస్కౌంట్‌ను మేం చెప్పాం. మీ నగరం లేదా డీలర్ ఈ డిస్కౌంట్లను ఎక్కువగా లేదా తక్కువగా కలిగి ఉండవచ్చు. కారు కొనడానికి ముందు డిస్కౌంట్‌కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోండి.