రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం(Andhra Pradesh)లోని గ్రామ, వార్డు సచివాలయాలను గ్రూపులుగా విభజించి, ఆయా సచివాలయాల్లోని ఉద్యోగులను విభజించారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15,004 సచివాలయాలను 7,715 గ్రూపులుగా విభజించాలని ఇదివరకే కలెక్టర్లు ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వాటికి ఆమోదముద్ర వేసింది. ఆయా సచివాలయాల్లో జనాభాను బట్టి ఏయే కేటగిరి పోస్టులు నియమించాలో, టెక్నికల్ సిబ్బంది ఉండాలో ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో 15,004 గ్రామ/వార్డు సచివాలయాలను 7,715 గ్రూపులుగా కూటమి ప్రభుత్వం(AP Government) విభజించింది. సచివాలయాల పరిధిలోని జనాభాను బట్టి ఇంజినీరింగ్/ ఎనర్జీ అసిస్టెంట్, వీఆర్‌వో/ సర్వే అసిస్టెంట్, ANM తప్పకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. సాగు పరిస్థితిని బట్టి అగ్రికల్చర్/ హార్టికల్చర్/ సెరికల్చర్/ అసిస్టెంట్లలో ఒకరిని, ఫిషరీస్/ వెటర్నరీ అసిస్టెంట్లలో ఒకరినీ, ఇంజినీరింగ్/ సర్వే అసిస్టెంట్/ వీఆర్‌వో లో అవసరమైన వారిని నియమించారు.
































