కమెడియన్గా తెలుగులో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ధనరాజ్ బుల్లితెరపై పలు షోస్తో పాటు..వెండితెరపై కూడా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఈ క్రమంలోనే తన సినీ జర్నీలో అతని భార్య శిరీష ఎప్పుడు వెన్నంటే సపోర్ట్‌గా నిలిచిందంటూ ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయి.
ఇలాంటి నేపథ్యంలో తాజాగా ధనరాజ్ భార్య శిరీష మొదటిసారి ఇంటర్వ్యూకు హాజరై ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. శిరీష ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ధనరాజ్‌ది, తనది ప్రేమ వివాహం అని.. ధనరాజ్ విజయవాడ, నాది ఖమ్మం అంటూ వివరించింది.
తాను క్లాసికల్ డ్యాన్సర్ అని.. ధనరాజ్ ఫిలింనగర్ లో ఓ డాన్స్ స్టూడియో పెట్టినప్పుడు టీచర్ కోసం వెతుకుతున్నాడు.. అలా నన్ను కలిసాడు అంటూ చెప్పుకొచ్చింది. అదృష్టమా, దరిద్రమో తెలియదు కానీ.. నేను పరిచయమైన రోజే ధనరాజ్ అమ్మ క్యాన్సర్‌తో చనిపోయారని.. తాను వెళ్ళిపోతూ నన్ను అతనికి గిఫ్ట్ గా ఇచ్చిందని ధనరాజ్ ఫీల్ అవుతాడు అంటూ చెప్పుకొచ్చింది. ఇక తల్లి చనిపోయి.. అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేని సమయంలో నా దగ్గర ఉన్న బంగారం అంతా ఇచ్చేసి ఈ కార్యక్రమాలను పూర్తి చేపించాము అంటూ చెప్పుకొచ్చింది శిరీష. ఇక నవంబర్లో ఆమె చనిపోతే.. మార్చిలో మేము పెళ్లి చేసుకున్నం. మా లవ్ మ్యారేజ్ కూడా నేనే ప్లాన్ చేశా. రేపు మన పెళ్లి అనగానే సైలెంట్ గా తలుపాడు.
ఇంట్లో వాళ్ళను కాదని 15 ఏళ్లకే ఇంటి నుంచి బయటకు వచ్చి పెళ్లి చేసేసుకున్న. ఇక మా పెళ్లయిన మూడో రోజుకే జగడం సినిమా రిలీజ్ అయింది.. అక్కడి నుంచి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.. మంచి ఫేమ్ వచ్చిందని ఫైనాన్షియల్ గా కాస్త సెటిల్ అవుతున్నామని సమయానికి నిర్మాతగా ధనలక్ష్మి తలుపు తడితే సినిమా తీసాడు అంటూ శిరీషా వివరించింది. అసలు అలా చేయడం నాకు ఇష్టం లేదు. ముందే చెప్పా అయినా వినలేదు కచ్చితంగా ఆడుతుందని నమ్మి సినిమా తీశాడు. ఒకవేళ సినిమా పోతే జీరో నుంచి మొదలు పెట్టాల్సిందే అనుకున్న. నేను అనుకున్నట్లే మళ్లీ జీరో నుంచి మొదలయ్యాం.
సోషల్ మీడియాలో మా గురించి ఎన్నెన్నో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అలా మేము రోడ్డున పడ్డామని, విడాకులు తీసుకుంటున్నామని, ఇల్లు కూడా అమ్మేశాం అని ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. మా మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. అప్పుడు వారం, పది రోజులు పాటు మాట్లాడుకోం. అంతేకానీ.. విడాకులు తీసుకునే అంత సీన్ అయితే లేదు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఏవి పడితే అవి రాయకండి అంటూ చెప్పుకొచ్చింది. ఇక ధనరాజ్ ఫ్రెండ్స్ మా ఇంటికి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటారని.. సుడిగాలి సుదీర్ నాకు ఎక్కువగా క్లోజ్. ప్రస్తుతానికైతే తను అసలు పెళ్ళే చేసుకోనని అంటున్నాడు అంటూ శిరీష వివరించింది. ఇక శిరీషా తన లైఫ్ గురించి షేర్ చేసుకున్న విషయాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.