ఉద్యోగులకు దివాళి గిఫ్ట్.. ఒక డీఏ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం.. ఎప్పుడంటే

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. నవంబర్‌ 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో డీఏ నిధులు జమ చేస్తామని తాజాగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులతో ఉండవల్లిలోని నివాసంలో జరిగిన సమావేశం తర్వాత సీఎం ఈ ప్రకటన చేశారు.

ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులతో ఉండవల్లిలోని నివాసంలో శనివారం సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉద్యోగుల డీఏ అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సమావేశం తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్ చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని.. అందుకోసమే వారికి ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. నవంబరు 1వ తేదీని నుంచి ఉద్యోగుల జీతాల్లో డీఏ నిధులను జమచేస్తామని తెలిపారు.


ఉద్యోగుల ఖాతాల్లో డీఏ జమ చేయడానికి ప్రభుత్రానికి ప్రతి నెలా రూ.160 కోట్ల ఖర్చు అవుతున్నట్టు సీఎం తెలిపారు. పోలీసులకు ఈఎల్‌.. ఒక ఇన్‌స్టాల్‌ మెంట్‌ ఎల్‌ ఇస్తామని.. ఈ ఏఎల్ కింద రూ.105 కోట్లు ఇస్తామని తెలిపారు. మరో రూ.105 కోట్లు జనవరిలో ఇస్తామని హామీ ఇచ్చారు. 60 రోజుల్లోపు ఉద్యోగుల హెల్త్‌కు సంబంధించిన వ్యవస్థను స్ట్రీమ్‌లైన్‌ చేస్తాన్నారు. అలాగే ఉద్యోగులు చైల్డ్‌ కేర్‌ లీవ్స్‌ ఎప్పుడైనా వాడుకోవచ్చని తెలిపారు.

ఆర్టీసీ ఉద్యోగులకు ఒక ప్రమోషన్‌ పెండింగ్‌లో ఉందని..ఈ దీపావళికి RTC ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తామని సీఎం తెలిపారు. కింది స్థాయిలో కొన్ని విభాగాల వారికి గౌరవప్రదమైన డిజిగ్నేషన్‌ ఇస్తామన్నారు. ఎర్న్‌ లీవ్‌ ఒక ఇన్‌స్టాల్‌మెంట్‌ ఇస్తామని ఫైనాన్స్ కమిషన్‌ గ్రాంట్స్‌ రూ.2,793 కోట్లు ఇచ్చామని తెలిపారు. ఉద్యోగులందరూ దీపావళి ఆనందంగా జరుపుకోవాలి. రేపటి నుంచి మరింత ఉత్సాహంగా పనిచేస్తారని ఆశిస్తున్నానన్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.