ప్రకృతి ఇచ్చిన గొప్ప వరాల్లో నిమ్మకాయ ఒకటి. సహజంగా లభించే నిమ్మకాయతో ఎన్నో లాభాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీర్ణ సంబంధిత సమస్యలు మొదలు పలు రకాల అనారోగ్య సమస్యలకు నిమ్మరసం దివ్యౌషధంగా పనిచేస్తుంది.
అందుకే ప్రతీరోజూ నిమ్మరసాన్ని తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే కేవలం నిమ్మకాయలు మాత్రమే కాకుండా నిమ్మ ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని మీకు తెలుసా.? ఇంతకీ నిమ్మ ఆకులను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* బీపీని కంట్రోల్ చేయడంలో నిమ్మ ఆకులు ఎంతో ఉపయోగపడుతాయి. నిమ్మ ఆకులతో హెర్బల్ టీ చేసుకొని తాగడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ బీపీని అదుపు చేస్తుంది.
* చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా నిమ్మ ఆకులు ఉపయోగపడుతాయి. నిమ్మ ఆకులతో చేసిన హెర్బల్ టీ తాగడం వల్ల చర్మ వ్యాధుల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
* డయాబెటిస్‌తో బాధపడేవారికి కూడా నిమ్మ ఆకులు బాగా ఉపయోగపడుతాయి. నిమ్మ ఆకులతో చేసిన హెర్బల్ టీ తాగడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇందులో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
* జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా నిమ్మ ఆకుల టీ ఉపయోగపడుతుంది. వేడి నీళ్లలో ఆకులను నానబెట్టి ఆ నీటిని క్రమంతప్పకుండా తాగాలి. ఇలా చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగువుతుంది. అలాగే ఇవి శరీరానికి అవసరమైన గట్ బ్యాక్టీరియాను ఉత్పత్తి చేసేందుకు తోడ్పడుతుంది.
* నిమ్మ ఆకులను మజ్జిగలో కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
* చర్మంపై దద్దుర్లు, మొటిమలు సమస్యలు కూడా నిమ్మ ఆకులతో దూరమవుతుంది. నిమ్మ ఆకులను లేపనంలా చేసి చర్మంపై అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే నొప్పులు తగ్గిపోతాయి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.