వర్షాకాలంలో తడి బట్టలు దుర్వాసన వస్తున్నాయా? ఈ సింపుల్ టిప్స్‌తో సమస్యకు చెక్‌

www.mannamweb.com


వర్షాకాలం అంటేనే తేమతో కూడిన వాతావరణం. ఈ వాతావరణంలో బట్టులు తడిస్తే ఓ పట్టాన ఆరవు. ఆరుబటయ ఆరబెట్టాలంటే నిరతరంగా వర్షం కురుస్తుంది. దీంతో చేసేది లేక ఇంట్లోనే ఇరబెడుతుంటాం.

కానీ బట్టలు సరిగ్గా ఆరకపోవడం వల్ల దుర్వాసన వస్తుంటాయి. బట్టలు దుర్వాసన వస్తే, వాటిని ధరించలేరు. పైగా ఈ కాలంలో సూర్యరశ్మి కూడా ఉండదు. ఫలితంగా బట్టలు నుంచి దుర్వాసన తొలగించడం కష్టంగా మారుతుంది. అయితే, ఈ ఇంటి నివారణలతో బట్టల వాసనను సులభంగా తొలగించవచ్చు.

బట్టలు ఉతికే సమయంలో నీళ్లలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. బట్టల వాసనను నిమ్మకాయ వాసన పారదోలుతుంది. నిమ్మకాయ నీళ్లతో బట్టలు ఉతకడం వల్ల దుర్వాసన పోవడమే కాకుండా బ్యాక్టీరియా కూడా దూరమవుతుంది. డిటర్జెంట్‌లో బట్టలు ఉతికిన తర్వాత వాటిని బేకింగ్ సోడాలో కాసేపు నానబెట్టాలి. ఇది బట్టల వాసనను తొలగించడమే కాకుండా మరకలను కూడా తొలగిస్తుంది.

వర్షంలో తడిసిన బట్టల నుంచి దుర్వాసనను తొలగించడంలో వెనిగర్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వెనిగర్ కలిపిన నీటిలో బట్టలు కాసేపు నానబెట్టాలి. వెనిగర్ బట్టల నుంచి దుర్వాసనను, అలాగే మురికిని సులభంగా తొలగిస్తుంది. బట్టలు ఉతికిన తర్వాత ఎండలో ఉంచలేకపోతే, కనీసం గాలి ప్రసరించే బహిరంగ ప్రదేశంలో వాటిని ఆరనివ్వాలి. మంచి గాలిలో బట్టలు ఆరబెట్టినా దుర్వాసన పోతుంది.

బట్టలు ఉతికిన తర్వాత ఒకే చోట కుప్పలు వేయకూడదు. దీనివల్ల దుర్వాసన వస్తుంది. వర్షం పడితే ఇంట్లో ఫ్యాన్ కింద బట్టలు పరచి ఆరనివ్వాలి.

బట్టల దుర్గంధాన్ని తొలగించేందుకు నేడు మార్కెట్లో కొన్ని సువాసనగల ద్రవ ఉత్పత్తులు వస్తున్నాయి. బట్టలు ఉతికిన తర్వాత ఆ ద్రవం కలిపిన నీటిలో బట్టలు నానబెట్టి, ఆరవేస్తే దుర్వాసన పోయి, మంచి వాసన వస్తుంది.