మీరు ఎసీ వాడే ముందు శుభ్రం చేస్తున్నారా..

ఎండలు మొదలవుతున్నాయి కాబట్టి మనం ఎసీ వాడటం మొదలుపెడతాం. కానీ దీన్ని శుభ్రం చేయకుండా నేరుగా ఉపయోగిస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పొడిగా మారిన కాలుష్యం, దుమ్ము, ధూళి అన్నీ ఎసీ లోపల చేరిపోతాయి. ఇవి గాలి నాణ్యతను ప్రభావితం చేసి అనారోగ్యానికి దారితీస్తాయి.


వేసవి ప్రారంభంలోనే ఎసీని సరిగ్గా శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. ఎసీని చక్కగా శుభ్రం చేస్తే ఇది మంచి చల్లదనాన్ని అందించడమే కాకుండా దాని పనితీరును మెరుగుపరుస్తుంది. ఇంట్లోనే దీన్ని శుభ్రం చేసుకునే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డిటర్జెంట్ తో క్లీనింగ్
స్ప్లిట్ ఎసీ ఫిల్టర్ లేదా మెష్ శుభ్రం చేయడానికి రెండు కప్పుల గోరువెచ్చని నీటిలో మూడు చెంచాల డిటర్జెంట్ వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని మెష్ మీద అప్లై చేసి మృదువైన బ్రష్ సహాయంతో మెల్లగా శుభ్రం చేయండి. ఇది మెష్ పై పేరుకున్న ధూళిని తొలగించడంలో సహాయపడుతుంది.

వాక్యూమ్ క్లీనర్
ఎసీ మెష్ తో పాటు నెట్‌ను కూడా శుభ్రంగా ఉంచాలనుకుంటే వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించండి. ఇది ధూళిని బాగా తీసివేసి ఎసీ నుండి స్వచ్ఛమైన గాలి రావడానికి సహాయపడుతుంది.

ఎసీపై మరకలు, బ్యాక్టీరియా
ఎసీ బయట భాగాన్ని శుభ్రం చేయడానికి రెండు కప్పుల నీటిలో రెండు స్పూన్ల వెనిగర్ కలిపి స్ప్రే బాటిల్‌లో పోసుకుని తడి బట్టతో మెల్లగా శుభ్రం చేయండి. ఇది ఎసీపై పేరుకున్న మరకలను, బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది.

నీరు నిల్వ కాకుండా చూడండి
ఎసీని నీటితో శుభ్రం చేసిన తర్వాత వెంటనే వాడకుండా కొంతసేపు తెరిచి ఉంచాలి. లోపల తేమ పేరుకుపోవడం వల్ల ఫంగస్, బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. గాలి సరిగ్గా ప్రసరించేందుకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

సాఫ్ట్ క్లాత్ తో తుడవండి
శుభ్రం చేసిన తర్వాత మృదువైన బట్టతో ఎసీలో ఎక్కడ కూడా తడి లేకుండా మంచిగా తుడవండి. దీంతో ఎసీ శుభ్రంగా ఉంటుంది. ఈ సింపుల్ చిట్కాలను పాటించి ఎసీని ఉపయోగించండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.