పండ్లు మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయని చాలామంది చెబుతారు. అయితే సీజన్ తో పాటు వచ్చే అన్ని రకాల పండ్లను ప్రతి ఒక్కరు తినవచ్చు కానీ పండ్లను తినేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏ పండ్లు తినాలి? ఎంత తినాలి? ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఏవి తినకూడదు? అనే విషయాలు క్షుణ్ణంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
దానిమ్మ పండు తినొచ్చా?
ఇక మనం ప్రతిరోజు తినే పండ్లలో దానిమ్మ పండు ఒకటి. దానిమ్మ పండును అందరూ ఇష్టంగా తింటారు. అయితే దానిమ్మ పండు తినకూడని వారు కూడా ఉన్నారు. అసలు దానిమ్మ పండును ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సర్జరీలు చేయించుకునే వారు
దానిమ్మ పండును ఆపరేషన్ చేయించుకునే వారు తినకూడదు. ఏదైనా సర్జరీ చేయించుకోవాలని అనుకునేవారు ముందే దానిమ్మ పండును తినడం మానుకోవాలి. ఎందుకంటే ఇది రక్తం గడ్డకట్టే విధానాన్ని ప్రభావితం చేస్తుంది సర్జరీ సమయంలో అధిక రక్తస్రావం ప్రమాదాన్ని ఇది బాగా పెంచుతుంది.
వీరు దానిమ్మ పండు తింటే ఇబ్బంది
దానిమ్మపండును అలర్జీలు ఉన్నవారు తినకూడదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దురదలు, వాపులు వంటి సమస్యలు అలర్జీ ఉన్నవారు దానిమ్మపండు తింటే వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు మధుమేహ వ్యాధిగ్రస్తులు దానిమ్మపండు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు దానిమ్మ పండును ఎక్కువ తినకూడదు. అందులో తినాలి దానిమ్మలో అధిక చక్కెర ఉంటుంది కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెంచే ప్రమాదం ఉంటుంది. కనుక దానిమ్మను మధుమేహం ఉన్నవారు తక్కువ తీసుకోవాలి.
మందులు వాడేవారు, లో బీపీ ఉన్నవారు దానిమ్మ తినొద్దు
లో బీపీతో ఇబ్బంది పడేవారు దానిమ్మను తినకూడదు. దానిమ్మ రక్తపోటును తగ్గిస్తుంది. ఇక లోబీపీ ఉంటే అది మరింత తగ్గి ఇబ్బంది ఎదురవుతుంది. కొన్ని రకాల మందులు వాడే వారు కూడా దానిమ్మ పండును తినకూడదు. దీర్ఘకాలిక మలబద్ధకం ఉన్నవారు దానిమ్మ పండ్లను ఎక్కువ తింటే అనవసరపు ఇబ్బంది వస్తుంది. కనుక దానిమ్మ పండ్లు తినాలి అనుకునేవారు కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకొని దానిని బట్టి తినాలా వద్దా అనేది నిర్ణయించుకోండి. ఇంకా అనుమానం ఉంటే వైద్యుడిని సంప్రదించి ఆయన సలహా మేరకు తినండి.
































