మన శరీరంలో కిడ్నీలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కిడ్నీ ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరు కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మనిషి జీవించాలంటే, మానవ మనుగడకు ముఖ్యమైన వాటిలో కిడ్నీలు ఒకటి.
అటువంటి కిడ్నీ ఆరోగ్యం పైన ప్రతి ఒక్కరు కచ్చితంగా దృష్టి సారించాలి. మన శరీరానికి రక్తాన్ని చేరవేయడానికి, రక్తంలోని మలినాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేసి పంపడానికి కిడ్నీలు ఎంతగానో ఉపయోగపడతాయి.
రాత్రివేళల్లో ఈ సంకేతాలతో కిడ్నీల ఆరోగ్యం డేంజర్ లో
అటువంటి కిడ్నీలు సరిగా పనిచేయకపోతే దానికి సంబంధించి రాత్రిపూట స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీల ఆరోగ్యం గురించి అలర్ట్ అవ్వాల్సిందే. మరి ఆ సంకేతాలు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం. రాత్రివేళ అర్ధరాత్రి సమయంలో నిద్ర లేచినప్పుడు మీ కాళ్లు బాగా వాపుగా ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే వస్తాయి.
తరచూ బాత్ రూమ్ కు వెళ్తున్నారా?
అంతేకాదు రాత్రిపూట మేల్కొని తరచుగా బాత్రూం కి వెళ్ళవలసిన రావడం కచ్చితంగా అలర్ట్ అవ్వవలసిన విషయం. రాత్రివేళ రెండు నుండి మూడు గంటలకు, బాత్రూం కి వెళ్ళవలసి వస్తుంటే మూత్రపిండాలు సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి అని, కిడ్నీలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికగా భావించాలి. కచ్చితంగా వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
నిద్ర లేచాక ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?
ఇవి మాత్రమే కాదు రాత్రివేళ నిద్రలేస్తే విశ్రాంతి లేకపోవడం, నిద్రపోవడంలో ఇబ్బంది, తరచుగా మేల్కోవడం, నిద్ర నాణ్యత సరిగా లేకపోవడం వంటివి మూత్రపిండాల సంబంధిత సమస్యకు సంబంధించిన లక్షణాలుగా చెప్పవచ్చు. అంతేకాదు తరచూ నిద్రలో కండరాల నొప్పులు రావడం, నిద్రపోయి లేచిన తర్వాత కూడా అలసటగా ఉండటం వంటి సంకేతాలు కూడా మూత్రపిండాల జబ్బులకు సంబంధించిన సంకేతాలు కావచ్చు.
రాత్రివేళ నిద్రలో నొప్పులు, ఈ లక్షణాలు ఉంటే అలెర్ట్
ఇలా రాత్రివేళ నిద్రలో కండరాల నొప్పులు రావడం, క్యాల్షియం మరియు ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను సూచిస్తాయి. ఇది ఒక్కొక్కసారి మూత్రపిండాల వైఫల్యం వల్ల కూడా జరగవచ్చు. బాగా నిద్ర పోయినప్పటికీ రోజంతా తల తిరుగుతున్నట్టు, నిరంతరం అలసిపోయినట్లు నీరసంగా ఉంటే, మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం లేదని, అవి శరీరంలో నుంచి టాక్సిన్స్ ను బయటకు పంపించడం లేదని అర్థం. రాత్రివేళ ఈ లక్షణాలు కనిపిస్తే పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకండి.
































