బ్యాంకు లాకర్‌ను ప్రతి ఒక్కరికీ బ్యాంకులు అందించవు. బ్యాంకుల్లో లాకర్లను తీసుకోవాలంటే ఖాతాాదారులు కొన్ని నిర్ధిష్ట నియమాలను పాటించాల్సి ఉంటుంది.
నగలు, ముఖ్యమైన పత్రాలు ఇతర విలువైన వస్తువులను భద్రపర్చడానికి బ్యాంక్ లాకర్ సురక్షితమైన ప్రదేశం. చాలా బ్యాంకులు వారి కస్టమర్లకు లాకర్లను అందిస్తాయి. అయితే వాటి లభ్యత భిన్నంగా ఉంటాయి.
మీ ఇంటికి సమీపంలో ఉన్న అద్భుతమైన సేవను అందించడానికి పేరుగాంచిన, మీరు ఇప్పటికే ఖాతాను కలిగి ఉన్న బ్యాంక్‌ని ఎంచుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. చాలా బ్యాంకులు కస్టమర్‌లు ముందుగా సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతా తెరవాలని కోరుతున్నాయి. అదనంగా వారు ఇటీవలి పాస్‌పోర్ట్-పరిమాణ ఫోటోతో పాటు, పాన్ లేదా ఆధార్ కార్డ్ వంటి గుర్తింపు, చిరునామా రుజువును అందించాలి.
లాకర్ కేటాయించిన తర్వాత కస్టమర్‌కు ప్రత్యేకమైన కీ అందిస్తారు. అయితే బ్యాంక్ మాస్టర్ కీని కలిగి ఉంటుంది. లాకర్ కేటాయించడానికి బ్యాంకులకు సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా నగదు రూపంలో రీఫండ్ చేయగలిగే సెక్యూరిటీ డిపాజిట్ అవసరం.
లాకర్‌ని ఉపయోగించడం కోసం నిబంధనలు, షరతులను వివరించే పత్రాన్ని బ్యాంక్ అందిస్తుంది. రెండు పార్టీలు ఈ చట్టబద్ధమైన ఒప్పందంపై సంతకం చేయాలి. లాకర్లు వివిధ పరిమాణాలలో అందుబాటులో ఉన్నాయి. కేటాయింపు అనేది లభ్యతపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వెయిటింగ్ పీరియడ్ ఉండవచ్చు.
లాకర్‌ని అద్దెకు తీసుకునే ఖర్చు అనేది బ్యాంకు శాఖ ఉన్న స్థానం, లాకర్ పరిమాణం ఆధారంగా నిర్ణయిస్తారు. అనుమతించిన దానికంటే ఎక్కువసార్లు లాకర్‌ని సందర్శిస్తే అదనపు రుసుములు వర్తిస్తాయి. బ్యాంక్ లాకర్లు సాధారణంగా సురక్షితంగా పరిగణిస్తున్నా అవి పూర్తిగా ప్రమాద రహితమైనవి కావని నిపుణులు చెబుతున్నారు. లాకర్ల కంటెంట్‌కు తాము బాధ్యత వహించబోమని మెజారిటీ బ్యాంకులు స్పష్టంగా పేర్కొన్నాయి. ఫలితంగా విలువైన వస్తువులకు బీమా పొందడం మంచిది.