‘థాయ్ లాండ్’ వెళ్లే ప్లాన్ ఉందా..? బడ్జెట్ ధరలోనే ఫ్లైట్ టూర్ ప్యాకేజీ

www.mannamweb.com


IRCTC Hyderabad Thailand Tour : ఐఆర్‌సీటీసీ టూరిజం.. థాయ్లాండ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. బ్యాంకాక్, పట్టాయా వంటి టూరిజం స్పాట్ లను చూస్తారు. టూర్ షెడ్యూల్ తో పాటు ధరల వివరాలను ఇక్కడ చూడండి

హైదరాబాద్ నుంచి థాయ్ లాండ్ కు ఐఆర్‌సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఆగస్టు 24, 2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది

‘TREASURES OF THAILAND EX HYDERABAD’ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకుంటే 4 రోజుల పాటు థాయ్ లాండ్ లో పర్యటిస్తారు

థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీని( ఫ్లైట్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. తొలి రోజు రాత్రి 09 గంటలకు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరాల్సి ఉంటుంది. ముందుగా పట్టాయాకు చేరుకుంటారు. పలు పర్యాటక ప్రాంతాలను చూస్తారు. రాత్రికి పట్టాయాలోనే ఉంటారు. రెండో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…ఇండియన్ లాంచ్ లో ఐల్యాండ్ కు వెళ్తారు.ఆ తర్వాత నాంగ్ నుచ్ ట్రాఫికల్ గార్డెన్ కు వెళ్తారు. ఇండియన్ రెస్టారెంట్ లో భోజనం ఉంటుంది. రాత్రి కూడా పట్టాయాలోనే బస ఉంటుంది.

మూడో రోజు పట్టాయాలోనే సఫారీకి వెళ్తారు.మెరైన్ పార్క్ ను సందర్శిస్తారు. మధ్యాహ్నం తర్వాత బ్యాంకాక్ కు చేరుకుంటారు. స్థానికంగా ఉన్న పలు ప్రాంతాలను చూస్తారు.4వ రోజు బ్యాంకాక్ సిటీలోని పలు ప్రాంతాలను చూస్తారు. పలు ఆలయాలను కూడా సందర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు బ్యాంకాక్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ్నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు

హైదరాబాద్ – థాయ్ లాండ్ టూర్ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ. 57, 820గా ఉంది. డబుల్ షేరింగ్ కు 49, 450గా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 49, 450గా ప్రకటించారు. 5- 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి.

www.irctctourism.com క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే… 040-27702407 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. ఈ ప్యాకేజీ డైరెక్ట్ లింక్ : https://www.irctctourism.com/