చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిలో తేనె, కాస్తింత నిమ్మరసం కలుపుకుని తాగడం అలవాటు. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు.
ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని చాలా మంది నమ్మకం.
నిజానికి, వేడి లేదా గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు అంటున్నారు. దీనిపై ఇటీవల ఒక షాకింగ్ నివేదిక వెలువడింది.
ఆయుర్వేదం ప్రకారం ఈ అలవాటు చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయట. మీరూ దీన్ని చేస్తుంటే జాగ్రత్తగా ఉండటం మంచిది.
ఆయుర్వేదం ప్రకారం.. వేడి పదార్థాలతో తేనె కలిపి తాగడం అస్సలు మంచిది కాదు. దీనిని సేవించడం అస్సలు ఆరోగ్యకరం కాదు. ఇది ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
తేనెను ఎప్పుడూ వేడి చేయకూడదు. ఉడికించకూడదు. తేనెను వేడి నీటిలో కలిపినప్పుడు అది మీ శరీరానికి విషపూరితంగా మారుతుంది. ముఖ్యంగా 140 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద తేనె విషపూరితంగా మారుతుందని ఓ అధ్యయనంలో తేలింది. మీరు వేడి పాలు లేదా నీటిలో తేనె కలిపితే ఆ వేడికి విషపూరితంగా మారుతుంది.



































