మనందరి ఇళ్లల్లో పాల వినియోగం తప్పనిసరిగా ఉంటుంది. ఆవుపాలు, గేదె పాలను ప్రత్యేకంగా ఇంటి అవసరాలు కాఫీ,టీ, పెరుగు కోసం పాలను వాడుతుంటారు. పిల్లలు, పెద్దలు రోజూ పాలుతాగుతుంటారు.
కొందరు మేక పాలను కూడా వాడుతారు. అయితే, ఈ పాలన్నీ తెల్లగా స్వచ్ఛగా ఉంటాయని మనందరికీ తెలిసిందే. కానీ, ఒక జంతువు పాలు నల్లగా ఉంటాయని మీకు తెలుసా..? అవును, చాలా జంతువుల పాలు తెల్లగా ఉంటాయి, కానీ, పాలు నల్లగా ఉండే జంతువు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్యకరమైన జీవితానికి మంచి ఆహారపు అలవాట్లు ఎంత ముఖ్యమో. అదే విధంగా పిల్లల పోషణకు పాలు అత్యంత ముఖ్యమైనవి. దాదాపు పిల్లలందరికీ ఎక్కువగా తల్లిపాలనే పడుతుంటారు. కానీ, కొందరు పిల్లలకు ఆవుపాలు, గేదె పాలు తాగిస్తుంటారు. పిల్లలతో పాటు పెద్దలు, మహిళలు కూడా పాలు తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తారు. కానీ, పాల రంగు విషయానికి వస్తే చాలా మంది పాల రంగు తెలుపు అని చెబుతారు. ఇది కాకుండా మీరు లేత పసుపు రంగు పాలను కూడా చూసి ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా నలుపు రంగు పాలను చూశారా..? బహుశ మీరు ఇలాంటివి చూసి ఉండకపోవచ్చు.
చాలా తక్కువ మంది మాత్రమే నల్ల పాలను చూసి ఉంటారు. అయితే, ఇలాంటి నలుపు రంగు పాలు ఆడ నల్ల ఖడ్గమృగం నుండి వస్తాయి. వాటిని ఆఫ్రికన్ బ్లాక్ ఖడ్గమృగం అని కూడా అంటారు. ఖడ్గమృగం ఇచ్చే పాలు పూర్తిగా నల్లనిరంగులో ఉంటాయి. వీటిలో కొవ్వు అస్సలు ఉండదని చెబుతుంటారు. ఇవి ఆర్యోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు. శరీరానికి కావాల్సిన పోషకాలు, వీటి వల్ల పుష్కలంగా అందుతాయని చెబుతారు. ఖడ్గమృగం తల్లి పాలలో నీరు ఉంటుంది. 0.2 శాతం కొవ్వు మాత్రమే ఉంటుంది. ఈ నల్లని పాలు జంతువుల్లో పునరుత్పత్తి ప్రక్రియను నెమ్మదిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే నల్ల ఖడ్గమృగాలు నాలుగు నుండి ఐదు సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే పునరుత్పత్తి చేయగలవు. ఇది కాకుండా, వాటి గర్భం సాధారణం కంటే ఎక్కువ. ఇవి ఒక సంవత్సరం కంటే ఎక్కువ పాటు గర్భాన్ని మోస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.