Dry Coconut Benefits: పచ్చి కొబ్బరిలో ఎన్ని విటమిన్స్, మినరల్స్ ఉంటాయో పచ్చి కొబ్బరిలో కూడా అన్ని ఉంటాయి. ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్, కాల్షియం, మాంగనీస్, సెలీనియం, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం మొదలగు అన్ని రకాలు ఇందులో ఉంటాయి. ఇక ఎండుకొబ్బరిలో వీటితో పాటు అదనంగా యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. ప్రతి రోజు 50 గ్రాముల చొప్పున తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అంతేకాదు మలబద్దకం దూరం అవుతుంది. స్త్రీలు డెలివరీ తర్వాత కొబ్బరి స్వీట్ తింటే చాలా మంచిది. శారీరక అలసట దూరం అవుతుంది.
శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడమే కాదు.. చర్మ సమస్యల నుంచి కూడా కాపాడుతుంది ఎండు కొబ్బరి. అందుకే దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలు రావు. మానసిక ఆరోగ్యానికి కూడా ఎండు కొబ్బరి చాలా సహాయం చేస్తుంది. కానీ కాస్త జీర్ణం అవడానికి సమయం పడుతుంది. ఐరన్ పుష్కలంగా ఉండే ఎండు కొబ్బరిని బెల్లంతో కలిపి తీసుకుంటే రక్త హీనత సమస్య తగ్గుతుంది. ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల తలనొప్పి బాధితులకు హెల్ప్ అవుతుంది.
ఎండు కొబ్బరి వల్ల శక్తి వస్తుంది. రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. తరచూ ఎండు కొబ్బరి తినడం వల్ల సంతాన లేమి సమస్యలు తగ్గుతాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ. రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు మెదడు పని తీరు మెరుగుపడుతుంది. కానీ మితంగా తీసుకోవాలి. ఎండు కొబ్బరి గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ ను సులభంగా తగ్గిస్తుంది. ఎండు కొబ్బరి వల్ల మెదడు పదును అవుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
కొబ్బరి పొడి అయినా లేదా తడి రూపంలో అయినా తినడం వల్ల జుట్టుకు చాలా ఉపయోగం. జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. దీని వల్ల కొత్త జుట్టు పెరుగుతుంది. మీ జుట్టు నల్లగా మెరుస్తుంది కూడా. ఎండు కొబ్బరి వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా సొంతం అవుతుంది. చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. చర్మం మృదువుగా , స్మూత్ గా తయారవుతుంది.