ఆముదపు గింజల నుంచి తీసిన నూనె ఆముదపు నూనె. చిక్కగా ఉండే ఆముదం నూనెను సాధారణంగా ఆయుర్వేదం వైద్యంలో ఉపయోగిస్తారు. అనేక పోషకాలు సమృద్దిగా ఉండే ఒకరకమైన నూనె. జుట్టు, చర్మం సహా అనేక ఆరోగ్యప్రయోజనాలను ఇస్తుంది. ఆముదాన్ని అనేక ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కోసం ఉపయోగిస్తారు. ఈ రోజు ఆముదం ఇచ్చే బిన్నమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం
భారతదేశంలో పొదల్లాగా పెరుగే ఆముదం చెట్లను సులభంగా చూడవచ్చు. తరచుగా ఆముదం ఆకులను గాయాలకు.. వాటి వల్ల కలిగే నొప్పి, వాపు నుంచి ఉపశమనం పొందేదానికి ఉపయోగిస్తారు. అయితే ఆముదం విత్తనాలను నూనె తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఆముదం నూనెలో సమృద్ధిగా రకరకాల పోషకాలు ఉన్నాయి. చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ నూనెను చాలా కాలంగా చర్మ సమస్యలతో పాటు ఆరోగ్య సంబంధిత సమస్యలకు ఉపయోగిస్తున్నారు. ఆముదం నూనెను అనేక ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు. ఆముదంలో అనేక లక్షణాలున్నాయని ఆయుర్వేద వైద్యం పేర్కొంది.
ఆముదం ఒక సహజ భేదిమందు. అనేక ఇతర యాంటీఆక్సిడెంట్లను కూడా కలిగి ఉంటుంది. అయితే దీనిని నిపుణుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని రకాల వైద్య పరిస్థితులలో ఆముదం నూనెను తీసుకోకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఆముదం ఇచ్చే ఐదు ప్రయోజనాలను తెలుసుకుందాం.
కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం: కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో కూడా ఆముదం ప్రభావవంతంగా ఉంటుంది. దీన్ని గోరువెచ్చగా అప్లై చేయాలి. ఈ నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కనుక ఆముదం నూనెను మసాజ్ చేయడం వల్ల కండరాల వాపు తగ్గుతుంది. ఉపశమనం లభిస్తుంది.
చర్మానికి మేలు : ఆముదం నూనె కూడా చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచి మంచి పోషణనిస్తుంది. దీనివల్ల చర్మం మృదువుగా మారుతుంది. ముఖం యవ్వనంగా కనిపిస్తుంది. ఆముదాన్ని నేరుగా చర్మంపై అప్లై చేయవచ్చు లేదా మాయిశ్చరైజింగ్ గుణాలు కలిగిన నూనెతో కలిపి అప్లై చేయవచ్చు.
జుట్టుకు పోషణ : తలపై ఆముదం నూనెను మసాజ్ చేసిన తర్వాత కనీసం రెండు గంటలు జుట్టుకు ఆముదం పట్టేలా ఉంచాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఆముదాన్ని క్రమం తప్పకుండా అప్లై చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు పెరుగుదల కూడా మెరుగుపడుతుంది.
మలబద్ధక నివారణకు : తరచుగా మలబద్ధకం సమస్య ఉన్న వ్యక్తులకు ఆముదం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలతో ఆముదం కలిపి తీసుకోవాలి. అయితే.. ఆముదాన్ని చాలా తక్కువ పరిమితిలో తీసుకోవాలి. లేదంటే ఇది మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
ఆముదంతో అదనపు ప్రయోజనాలు: ఆముదం నూనె రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కళ్ళకు ప్రయోజనకరంగా ఉంటుంది. చుండ్రును తగ్గిస్తుంది. జుట్టు మెరుపును పెంచుతుంది. దీనితో పాటు ఆముదం చర్మంపై పిగ్మెంటేషన్, నల్లటి మచ్చలను తగ్గించడంలో, చర్మంపై గీతలు, ముడతలను నివారించడంలో కూడా సహాయపడుతుంది.