శివశక్తికి ప్రతీక.. పెళ్లైన స్త్రీలు నల్లపూసలు ధరిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

హిందూ సంప్రదాయం ప్రకారం, పెళ్లైన స్త్రీలు మంగళసూత్రం, కాలి మెట్టెలు, నల్లపూసలు వంటి కొన్ని ఆభరణాలను తప్పనిసరిగా ధరిస్తారు. ఈ ఆభరణాలు కేవలం అలంకరణ వస్తువులు కావు, వీటి వెనుక ఆధ్యాత్మిక, సాంప్రదాయక, అలాగే కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి.


పెళ్లైన స్త్రీలు ధరించే నల్లపూసల వెనుక సంప్రదాయం, ఆధ్యాత్మిక శక్తితో పాటు ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి.

హిందూ సాంప్రదాయం ప్రకారం, పెళ్లైన మహిళలు ధరించే మంగళసూత్రం, నల్లపూసలు వైవాహిక జీవితానికి చిహ్నాలు. నల్లపూసలు స్త్రీ దేహంపై ఉత్తమ పరిణామాలు కలిగిస్తాయి అని పండితులు చెబుతున్నారు. నల్లపూసలు ధరించడానికి ముఖ్య కారణాలు:

1. దృష్టి దోషాల నుంచి రక్షణ:

నలుపు రంగు చెడు దృష్టిని, దిష్టిని పోగొడుతుంది అని నమ్మకం ఉంది. అందుకే మంగళసూత్రంలో నల్లపూసలు వాడతారు.

నల్లపూసలు స్త్రీ చుట్టూ ఉన్న పరిసరాల్లోని దుష్ట శక్తులను, ప్రతికూలతను గ్రహించి వాటిని పారద్రోలడానికి సాయపడతాయి.

భార్య మెడలో నల్లపూసలు ఉండటం వలన భర్తకు ఎలాంటి ఆపద రాదు అని కొందరు బలంగా విశ్వసిస్తారు. భర్తకు రక్షణ కవచంగా నల్లపూసలు భావిస్తారు. వీటిని మెడకు ధరించాలి. లాంగ్ చైన్ లా వేసుకోరాదు.

2. ఆధ్యాత్మిక, దాంపత్య బలం:

నల్లపూసల్లో ఉండే బంగారం శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి ప్రతీక. నల్లని పూసలు శివుడికి ప్రతిరూపం.

శివశక్తుల కలయిక అయిన నల్లపూసలు దాంపత్యాన్ని నిత్యం స్త్రీలకు గుర్తు చేస్తాయి.

వివాహ సమయంలో వధూవరులచేత నల్లపూసల దండకు నీలలోహిత గౌరీకి పూజలు చేయిస్తారు. ఈ గౌరీ మాత అనుగ్రహంతో దంపతులు జీవితాంతం అన్యోన్యంగా సుఖంగా ఉంటారు అని శాస్త్రం చెబుతోంది.

నల్లపూసలు ధరించటం వలన జాతక దోషాలు, సర్పదోషాలు కూడా తొలగిపోతాయి అని పండితులు తెలియజేస్తున్నారు.

3. ఆరోగ్య ప్రయోజనాలు (వైజ్ఞానికం):

పూర్వకాలంలో నల్లపూసలను నల్ల మట్టితో తయారు చేసేవారు.

ఈ మట్టి పూసలు ఛాతీపై పడటం వలన శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తాయి అని పెద్దలు చెబుతారు.

శరీర వేడి తగ్గడం వలన గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడతాయి.

నల్లపూసల ధారణ స్త్రీల నాడులకు అనుకూలమై ఉండి, శరీరంపై ఉత్తమ పరిణామాలను కలిగిస్తుంది. దీని వలన స్త్రీ ప్రవర్తనలో నెమ్మదితనం వస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.