విస్కీలో ఎంత నీరు కలుపుకోవాలో తెలుసా.? 99 శాతం మందికి దీనిపై అవగాహన లేదంటా..

ప్రపంచవ్యాప్తంగా మద్యం ప్రియులు భారీగా ఉన్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వాలకు వచ్చే ఆదాయాల్లో మద్యం ద్వారా వచ్చేది అధిక భాగం ఉంటుంది.
దీనిబట్టే మద్యం అమ్మకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా మందుబాబులు మాత్రం తెగ తాగేస్తుంటారు.


ఇక ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సేవించే ఆల్కహాల్‌లో విస్కీ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటుంది. సాధారణంగా విస్కీని నీరు, సోడా, కూల్‌ డ్రింక్స్‌లో కలుపుకుని తీసుకుంటుంటారు. అయితే మద్యం సేవించే వారిలో సుమారు 99 శాతం మందికి అసలు విస్కీలో ఎంత నీరు కలుపుకోవాలన్న దానిపై అవగాహన ఉండదంటా. ఇదేదో ఆశామాషీగా చెబుతోన్న విషయం కాదు. పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించి మరీ తెలిపారు.

2023 సంవత్సరంలో నిర్వహించిన ఈ అధ్యయనంలో వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ, మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీతో పాటు ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఆహార శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పరిశోధకులు బృందం వివిధ రకాల విస్కీ, నీటిని అధ్యయనం చేసింది. అలాగే విస్కీ రుచిగా ఉండడానికి ఎంత నీరు కలపాలన్న దానిపై పరిశోధనలు చేపట్టారు. ఫుడ్స్ జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. 25 విభిన్న విస్కీలలో ఎంత నీరు కలపాలన్న వివరాలను వెల్లడించారు.

100 శాతం విస్కీ, 90 శాతం విస్కీలో 10 శాతం నీరు అలాగే.. 80 శాతం విస్కీలో 20 శాతం నీరు, 70 శాతం విస్కీలో 30 శాతం నీరు, 60 శాతం విస్కీలో 40 శాతం నీరు, 50 శాతం విస్కీలో 50 శాతం నీరు కలిపి శాస్త్రవేత్తలు పరీక్షించారు. 80 శాతం నీటిలో 20 శాతం నీటిని కలిపితే విస్కీ రుచిగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఫలితాల ప్రకారం, 12 ml నీరు విస్కీ రుచి మారకుండా చూస్తుంది. దీని కంటే ఎక్కువ నీరు కలపడం వల్ల విస్కీ పల్చగా మారుతుంది. దీని వల్ల సహజ రుచి పోతుంది. వివిధ రకాల విస్కీలను నీరు ఎలా ప్రభావితం చేస్తుందో కూడా అధ్యయనంలో తెలిపారు.