చాలా మంది వాట్సాప్ యూజ్ చేస్తారు. కానీ అందులో ఉండే ఫీచర్స్ గురించి వారికి చాలా వరకు తెలియదు. వాట్సాప్‌లో మీరు తెలియని ట్రిక్స్ చాలా ఉన్నాయి.
ఈరోజు మనం అలాంటి ఒక ట్రిక్ గురించి తెలుగుసుకుందాం. కొన్నిసార్లు మనం అవతల వారికి తెలియకుండా వారి వాట్సాప్ స్టేటస్ చూడాలని అనుకుంటాము. కానీ, చాలా మందికి దీన్ని ఎలా చేయాలో తెలియదు. మీరు కూడా ఇలా అవతల వారికి తెలియకుండా వాట్సాప్ స్టేటస్ చూడాలనుకుంటే.. దానికి ఒక మూడు మార్గాలు ఉన్నాయి. అవి ఏమిటి? దాన్ని ఎలా ఆన్ చేయాలి? ఇక్కడ తెలుసుకుందాం.
రీడ్ రిసీప్ట్ (Android/iOS) ని ఆఫ్ చేయడండి
ఆండ్రాయిడ్, iOS వాట్సాప్ వినియోగదారులకు వారి వాట్సాప్‌లో రీడ్ రిసీప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఎవరికీ తెలియకుండా సందేశాలను చదవడానికి మీకు సహాయపడుతుంది. మీరు సెలెక్టెడ్ పర్సన్ వాట్సాప్ స్టేటస్‌ను చూసినప్పుడు, మీ పేరు వారి హిస్ట్రీలో కనిపించదు. ఈ ఫీచర్‌ను ఎలా ప్రారంభించాలి:
ఫైల్ మేనేజర్ ద్వారా వాట్సాప్ స్టేటస్ చూడడం (ఓన్లీ ఆండ్రాయిడ్ )
మీకు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉంటే, మీరు మీ ఫోన్‌లో ఉండే ఫైల్ మేనేజర్‌కి వెళ్లి వాట్సాప్ ఫైల్‌లను చెక్ చేయవచ్చు. దీని కోసం, మీరు ఫైల్ మేనేజర్‌కి వెళ్లాలి. తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్‌కి వెళ్లండి. దీని తర్వాత, వాట్సాప్‌కి వెళ్లండి. తర్వాత మీడియా/స్టేటస్‌పై నొక్కండి. దీని తర్వాత, మీరు ఇక్కడ అన్ని వాట్సాప్ స్టేటస్‌లను చూస్తారు. మీకు ఈ ఫోల్డర్ కనిపించకపోతే, ఫైల్ మేనేజర్ సెట్టింగ్‌లకు వెళ్లి షో హిడెన్ ఫైల్స్‌ను ఎనేబుల్ చేయండి. కొన్ని ఫోన్‌లలో, ఇంటర్నల్ స్టోరేజ్ > ఆండ్రాయిడ్ > మీడియా > com.whatsapp > WhatsApp > మీడియాకి వెళ్లడం ద్వారా మీరు ఈ ఎంపికను పొందుతారు.
Incognito Mode వాట్సాప్ వెబ్‌ను యాక్సెస్ చేయండి
మీరు పిసి లేదా ల్యాప్‌టాప్‌లో వాట్సాప్ ఉపయోగించాలనుకునే వారు అయితే ncognito Mode ద్వారా వెబ్‌లోకి లాగిన్ అవ్వవచ్చు. వాట్సాప్ వెబ్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా, మీరు మీ కాంటాక్ట్‌లలో ఏ స్టేటస్‌నైనా చూడవచ్చు.
- ముందుగా, మీరు మీ ల్యాప్‌టాప్ లేదా PCలో Chrome బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి. ఆ తర్వాత సీక్రెట్ ట్యాబ్‌ను తెరవండి.
- ఇప్పుడు web.whatsapp.com ఓపెన్ చేసి, మీ ఫోన్‌తో వాట్సాప్‌ను లింక్ చేయండి
- లాగిన్ అయిన తర్వాత, స్టేటస్ ఐకాన్‌పై క్లిక్ చేసి, స్టేటస్ లోడ్ అయ్యే వరకు వేచి ఉండండి.
- దీని తర్వాత, Wi-Fi ని ఆఫ్ చేయండి. మీరు ఆఫ్‌లైన్‌లో స్థితిని తనిఖీ చేయవచ్చు.

































