పితృ పక్షంలో పూర్వీకులు మీ ఇంటికి ఏ రూపంలో వస్తారో తెలుసా?

భద్రపద పూర్ణిమ నుంచి ప్రారంభమై భాద్రపద అమావాస్య వరకు పితృ పక్షం కొనసాగుతుంది. ఈ 15 రోజులలో పూర్వీకులను స్మరించుకుంటారు. దీనివల్ల పితృదేవతల ఆత్మకు శాంతి లభిస్తుందని విశ్వాసం


పితృ పక్షం సమయంలో మీరు తెలిసి లేదా తెలియక చేసిన కొన్ని పనుల వల్ల పితృదేవతలు బాధపడవచ్చు.

పితృ పక్షం 15 రోజులలో పూర్వీకులు భూమి మీదకు వస్తారు.. ఏదో ఒక రూపంలో తమ కుటుంబ సభ్యులను కలుస్తారని చెబుతారు పండితులు. మీరు తెలిసి లేదా తెలియక పూర్వీకులను అవమానిస్తే అనుకోని సమస్యలు ఎదురవుతాయట.

కాకిని పితృదేవతల రూపంగా భావిస్తారు. అందుకే శ్రాద్ధంలో పితృదేవతల కోసం తయారు చేసిన ఆహారాన్ని కాకికి సమర్పిస్తారు. పావురం, పిచ్చుక వంటి పక్షులు ఇంటికి రావడం కూడా పితృదేవతల రాకను సూచిస్తుంది.

పితృ పక్ష సమయంలో ఆవు సహా ఇంకేదైనా జంతువు ఇంటి ముందుకి వస్తే వాటికి ఆహారం అందించండి. పితృదేవతల అనుగ్రహం మీపై ఉంటుంది

పితు పక్ష సమయలో ఇంటికి సాధువులు, సన్యాసులు లేదా బిచ్చగాళ్ళు వస్తే పొరపాటున కూడా వారిని అవమానించవద్దు , ఖాళీ చేతులతో పంపవద్దు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.